ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాశ్‌రావు టీఆర్‌ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలపై కీలక వ్యాఖ్యలు చేశారు. రామగుండంలోని పరిశ్రమల్లో ఉద్యోగాల కల్పిస్తామంటూ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పేర్లు చెప్పుకుని కొందరు వసూళ్లకు పాల్పడుతున్నారని గోనెప్రకాశ్‌రావు ఆరోపించారు. నేను దళిత వ్యతిరేకిని కాదన్నారు. ప్రజాప్రతినిధుల మాఫీయా వ్యవహారాలపై ప్రజా వేదిక ఏర్పాటు చేద్దామంటూ సవాల్ విసిరారు.
Read Also:ఆర్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో నూతన విద్య ప్రణాళిక పై చర్చ
నేను నోరు విప్పి నాయకుల రాసలీలలు బయట పెడితే ప్రజలు చీదరించుకుంటారన్నారు. కోల్ బెల్ట్‌లో ఇసుక, ప్లైయాష్, బూ కబ్జాల మాఫీయ జరుగుతున్న ప్రభుత్వం ఏం చేస్తుందని ఆయన ఆరోపించారు. నాయకుల బండారం కూడా త్వరలోనే బయటపెడతా అంటూ ఆయన హెచ్చరించారు. కాగా గోనె ప్రకాష్‌రావు గతంలో కూడా క త్వరలో బయట పెడతానన్నారు. కాగా గోనె ప్రకాష్ రావు గతంలో కూడా ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి.
