NTV Telugu Site icon

Telangana : బంగారం మెరిస్తే.. వెలవెలబోతున్న వెండి

Gold

Gold

బంగారం మెరిసింది. వెండి వెలవెలబోయింది. మంగళవారం మార్కెట్లలో బంగారం, వెండి ధరలు అస్థిరంగా నమోదయ్యాయి. మార్కెట్లలో బంగారం ధర పెరగగా.. వెండి ధర తగ్గింది. హైదరాబాద్, విజయవాడ నుంచి దేశ రాజధాని ఢిల్లీ వరకు ఇదే ట్రెండ్ నమోదైంది. చెన్నైలో మాత్రం బంగారం, వెండి రెండు ధరలూ తగ్గి అక్కడి కొనుగోలుదారులకు శుభవార్తగా నిలిచాయి. పెరుగుతోన్న బాండ్ ఈల్డ్స్.. అంతర్జాతీయంగా బంగారం, వెండి ధరలపై ఒత్తిళ్లకు దారితీస్తుందని విశ్లేషకులంటున్నారు. అంతర్జాతీయంగా నమోదవుతోన్న ధరల ప్రభావం కూడా దేశీయంగా వీటి ధరలపై ఉంటోంది.

బంగారం, వెండి ధరలలో నేడు మార్పులు చోటు చేసుకున్నాయి. తగ్గుతూ పెరుగుతూ వస్తోన్న ధరలు.. మంగళవారం కూడా అదే ట్రెండ్‌ను నమోదు చేశాయి. సోమవారం బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర స్థిరంగా రూ.47,400 వద్ద కొనసాగుతోంది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.51,710 వద్ద ఉంది. బంగారంతో పాటు వెండి ధరలలో ఎలాంటి మార్పు లేదు. ఈ ధర కేజీ రూ.66,800 పలుకింది. కాగా.. నిన్న స్థిరంగా ఉన్న బంగారం ధర.. నేడు పైకి ఎగిసింది. బంగారం మెరిసిన ఈ సమయంలో.. వెండి మాత్రం వెలవెలబోయింది.

హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధరపై రూ.100 పెరగడంతో.. ఈ రేటు రూ.47,500కు చేరుకుంది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.100 పెరిగి రూ.51,810గా నమోదైంది. బంగారం పెరిగిన ఈ సమయంలో వెండి రేటు పడిపోయింది. కేజీ వెండి ధర రూ.300 తగ్గడంతో.. హైదరాబాద్ మార్కెట్లో ఈ ధర రూ.66,500గా రికార్డయింది.

హైదరాబాద్‌తో పాటు విజయవాడలో కూడా బంగారం ధరలు పెరిగాయి. 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర విజయవాడలో కూడా రూ.100 పెరిగి రూ.47,500గా నమోదైంది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.51,810గా ఉంది. విజయవాడలో కూడా సిల్వర్ రేటు రూ.300 తగ్గి రూ.66,500గా ఉంది.

Asani Cyclone: దిశ మార్చుకున్న ‘అసని’.. ఏపీకి తప్పనున్న ముప్పు