బంగారం మెరిసింది. వెండి వెలవెలబోయింది. మంగళవారం మార్కెట్లలో బంగారం, వెండి ధరలు అస్థిరంగా నమోదయ్యాయి. మార్కెట్లలో బంగారం ధర పెరగగా.. వెండి ధర తగ్గింది. హైదరాబాద్, విజయవాడ నుంచి దేశ రాజధాని ఢిల్లీ వరకు ఇదే ట్రెండ్ నమోదైంది. చెన్నైలో మాత్రం బంగారం, వెండి రెండు ధరలూ తగ్గి అక్కడి కొనుగోలుదారులకు శుభవార్తగా నిలిచాయి. పెరుగుతోన్న బాండ్ ఈల్డ్స్.. అంతర్జాతీయంగా బంగారం, వెండి ధరలపై ఒత్తిళ్లకు దారితీస్తుందని విశ్లేషకులంటున్నారు. అంతర్జాతీయంగా నమోదవుతోన్న ధరల ప్రభావం కూడా దేశీయంగా…