Site icon NTV Telugu

Gold Price Today: మళ్లీ పెరిగిన పసిడి ధరలు.. ఎంతంటే..?

Gold Rates Today

Gold Rates Today

బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయింది. అంతర్జాతీయ మార్కెట్‌కు తోడు స్థానిక డిమాండ్‌ కూడా ఎప్పటికప్పుడు పసిడి ధరలను ప్రభావితం చేస్తూనే ఉంటుంది.. సీజన్‌ను బట్టి బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతూనే ఉంటాయి.. మరోసారి బంగారం ధర పైకి కదిలింది.. దేశంలో ద్రవ్యోల్బణ పరిస్థితుల వల్ల రానున్న రోజుల్లో కూడా ఇదే విధమైన ధరలు కొనసాగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో అనూహ్యపరిణామాలు చోటుచేసుకుంటే తప్ప దేశీయ ధరలు ఇలానే ఉండొచ్చని బులియన్‌ ట్రేడర్లు అంటున్నారు. ఇక ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నయో తెలుసుకుందాం. అయితే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర స్వల్పంగా పెరగగా, వెండి ధర తగ్గగా.. 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.40 పెరిగి.. ప్రస్తుతం రూ.52,500 వద్ద కొసాగుతుంది. ఈనేపథ్యంలో.. కిలో వెండి ధర రూ.250 తగ్గి.. రూ.55,600 వద్ద కొనసాగుతోంది.

read also: Shamshabad Airport: విదేశీ సిగరేట్లు పట్టివేత.. అదుపులో ఐదుగురు

ఇక రెండు తెలుగురాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, విలువలు ఎలా ఉన్నాయో చూద్దాం.
హైదరాబాద్‌: పది గ్రాముల బంగారం ధర రూ.52,500గా ఉంది. కిలో వెండి ధర రూ.55,600 వద్ద కొనసాగుతోంది.
విజయవాడ: 10 గ్రాముల పసిడి ధర రూ.52,500 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.55,600గా ఉంది.
వైజాగ్‌: 10 గ్రాముల పుత్తడి ధర రూ.52,500గా ఉంది. కేజీ వెండి ధర రూ.55,600 వద్ద కొనసాగుతోంది.
ప్రొద్దుటూర్‌: పది గ్రాముల పసిడి ధర రూ.52,500గా ఉంది. కేజీ వెండి ధర రూ.55,600 వద్ద కొనసాగుతోందని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి.

CPEC: పాక్, చైనాలకు ఇండియా స్ట్రాంగ్ వార్నింగ్

Exit mobile version