Site icon NTV Telugu

Gold Rate Today : పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధరలు..

Gold Price

Gold Price

బంగారం కొనాలనుకునే వారికి గుడ్‌న్యూస్‌. గత కొన్ని రోజులుగా పరుగులు పెడుతున్న పసిడికి బ్రేకులు పడ్డాయి. నేడు భారీగా బంగారం ధరలు తగ్గాయి. నిన్న పెరిగిన బంగారం ధరలు తాజాగా పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పడిపోవడంతో దేశీ మార్కెట్‌లోనూ ఆ ప్రభావం పడిందని నిపుణులు అంటున్నారు. నేడు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర ఏకంగా రూ. 540 పడిపోయింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 51,930కు దిగివచ్చింది. అలాగే ఆర్నమెంటల్ గోల్డ్ రేటు (22 క్యారెట్లు) కూడా ఇదే బాట పట్టింది. దీంతో.. ఈ పసిడి రేటు రూ. 500 తగ్గి 10 గ్రాముల బంగారం ధర రూ. 47,600కు వద్దకు చేరుకుంది.

What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

అయితే.. బంగారం ధర బాటలోనే వెండి కూడా పయనించింది. సిల్వర్ రేటు ఇంకా ఎక్కువగానే దిగిరావడం విశేషం. వెండి ధర ఏకంగా ఒకేసారి రూ. 2,200 పడిపోయింది. దీంతో వెండి రేటు కేజీకి రూ. 62,500కు చేరుకుంది. కాగా వెండి ధర గత రెండు రోజులు పెరుగుతూ ఏకంగా రూ. 1200 పైకి చేరుకుంది. అయితే ఈరోజు మాత్రం సిల్వర్ రేటు భారీగా దిగివచ్చింది. వెండి కొనాలనుకునే వారికి ఇది ఊటర కలిగించే అంశం అని పేర్కొనవచ్చు.

 

Exit mobile version