Bhadrachalam: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచలం వద్ద గోదావరి 54.7 అడుగులకు చేరుకుంది. నిన్నటితో పోలిస్తే గోదావరికి వరద కొద్దిగా తగ్గింది. మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఎగువ నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టడంతో గోదావరికి వరద తగ్గింది. శనివారం రాత్రికి గోదావరి 56.9 అడుగులకు చేరుకుంది. అయితే ఈ మధ్యాహ్నానికి గోదావరికి వరద కొద్దిగా తగ్గిందని అధికారులు చెబుతున్నారు. అయితే మళ్లీ వర్షాలు కురిస్తే ఇబ్బందులు తప్పవనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. భద్రాచలం ఆలయంలోని స్నానఘట్టం ఇంకా వరద నీటిలోనే ఉంది. గోదావరి, ఇతర నదులతో పాటు రోడ్లన్నీ నీట మునిగాయి. దీంతో దుమ్ముగూడెం, చర్ల, వాజేడు, వెంకటాపురం తదితర మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
Read also: Hyderabad: తండ్రి మందలించాడు.. గాజు పెంకుతో గొంతు కోసిన కూతురు
చింతూరు వద్ద శబరి నది 46 అడుగుల ఎత్తులో ప్రవహిస్తోంది. దీంతో కూనవరం, వీఆర్ పురం మండలాల్లోని పలు గిరిజన గ్రామాలు నీట మునిగాయి. మరోవైపు గోదావరి వరద ఉధృతికి భద్రాచలం పట్టణంలోని కొన్ని కాలనీలు జలమయమయ్యాయి. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. భద్రాచలం పట్టణంలో ఐదు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. భద్రాచలం నుంచి గోదావరి దిగువకు ప్రవహిస్తోంది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గోదావరి పరివాహక ప్రాంతాల్లోని లంక గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ధవళేశ్వరం నుంచి 14 లక్షల క్యూసెక్కుల నీటిని అధికారులు సముద్రంలోకి వదులుతున్నారు. ఈ నీరంతా పశ్చిమగోదావరి జిల్లాలోని లంక గ్రామాల మీదుగా సముద్రంలోకి కలుస్తుంది. గోదావరి నదికి వరద పోటెత్తడంతో లంక గ్రామాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
Mahesh Babu: సిర్ఫ్ దస్ దిన్ మే మిలేంగే సూర్య భాయ్…
