Godavari: భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. బుధవారం మధ్యాహ్నం 43 అడుగులు దాటిన తర్వాత అధికారులు తొలి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. రాత్రి 9.45 గంటలకు ప్రవాహం 48 అడుగులకు పెరగడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో శ్రీరాంసాగర్‌కు మళ్లీ వరద ఉధృతి పెరిగింది. ఏ క్షణంలోనైనా ఎస్‌ఎస్‌ఆర్‌ఎస్‌పీ ప్రాజెక్టు గేట్లు ఎత్తే అవకాశం ఉంది. ప్రాణహితలో వరద ప్రవాహం నిలకడగా ఉంది. కర్ణాటక, మహారాష్ట్రల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణా బేసిన్ ఎగువన ఉన్న ప్రాజెక్టులకు వరద ప్రవాహం నిలకడగా ఉంది. ప్రాజెక్టులకు నీరందుతోంది. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు కూడా స్వల్పంగా వరదనీరు వచ్చి చేరుతోంది. మూసీ ఏడు గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు.
Read also: Hyderabad :వర్షంలో బండి ఆగిందా? ఈ నెంబర్ కు కాల్ చెయ్యండి..!
ఖమ్మంలోని మున్నేరు వద్ద 24 అడుగుల ప్రభావం కొనసాగుతుంది. దీంతో మున్నేరు నేటితో లోతట్టు ప్రాంతాలన్నీ మనకమై అయ్యాయి నయాబజార్ కళాశాల సమీపంలోని కాలనీలు లోపలికి నీళ్లు వచ్చాయి. గత రెండు రోజుల నుంచి మున్నేరు తీవ్రస్థాయిలో వస్తుంటతో ఇప్పటికే పలువురని బాధితుల ప్రాంతాలకు తరలించారు. పలు కాలనీలోని ఇండ్లకు నీళ్లు రావడంతో ఎండ్ల మీద నివసిస్తున్నారు. మున్నేరు పక్కనే ఉన్న స్మశాన వాటిక పూర్తిగా మునిగిపోయింది. మొన్నేరు రావడంతో ఖమ్మం నుంచి మధిర వెళ్లే రహదారి పై రాకపోకలు నిలిపివేశారు.
Hyderabad :వర్షంలో బండి ఆగిందా? ఈ నెంబర్ కు కాల్ చెయ్యండి..!