Drug Awareness: ఇకపై డ్రగ్స్ జోలికి వెళ్లం.. గీతం యూనివర్సిటీ విద్యార్థుల ప్రతిజ్ఞ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Drug Awareness: డ్రగ్స్ మహమ్మారి నుంచి యువ విద్యార్థులను కాపాడేందుకు తెలంగాణ ఈగల్ ఫోర్స్ మరో ముందడుగు వేసింది. డ్రగ్స్ తీసుకున్నట్లు గుర్తించిన గీతం యూనివర్సిటీకి చెందిన నలుగురు విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు అబిడ్స్ లోని ఈగల్ ఫోర్స్ కార్యాలయంలో నవంబర్ 10న కౌన్సెలింగ్ నిర్వహించింది. ఈగల్ ఫోర్స్ ఎస్పీ గిరిధర్, ఐపీఎస్ ఆధ్వర్యంలో ఈ కౌన్సెలింగ్ జరిగింది. డ్రగ్స్ సేవించినట్లు గుర్తించిన నలుగురు విద్యార్థులను వారి తల్లిదండ్రులతో సహా ఈగల్ ఫోర్స్ కార్యాలయానికి పిలిపించారు. కుటుంబ సభ్యుల సమక్షంలోనే కౌన్సెలింగ్ నిర్వహించి, విద్యార్థులు, తల్లిదండ్రులు ఇద్దరూ ఈ సమస్య తీవ్రతను, సకాలంలో జోక్యం చేసుకోవడం ఎంత అవసరమో అర్థం చేసుకునేలా చేశారు.
కౌన్సెలింగ్ సందర్భంగా విద్యార్థులకు డ్రగ్స్ వినియోగం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యంపై, చదువుపై, వ్యక్తిగత సంబంధాలపై, భవిష్యత్ కెరీర్ పై పడే దుష్ప్రభావాలను వివరించారు. డ్రగ్స్ సంబంధిత కార్యకలాపాల వల్ల కలిగే చట్టపరమైన పరిణామాలను, అది వారి విద్య, ఉద్యోగ అవకాశాలు, భవిష్యత్తుపై ఎలా ప్రతికూల ప్రభావం చూపుతుందో వివరించారు. స్వీయ క్రమశిక్షణ పాటించాలని, చెడు స్నేహాలకు దూరంగా ఉండాలని, బాధ్యతాయుతమైన స్నేహాలు ఎంచుకోవాలని, చదువు, వ్యక్తిగత అభివృద్ధి, కెరీర్ లక్ష్యాలపై దృష్టి పెట్టాలని విద్యార్థులకు సూచించారు. కౌన్సెలింగ్ విద్యార్థులపై సానుకూల ప్రభావం చూపింది. తమ తప్పును అంగీకరించిన విద్యార్థులు పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకున్నారు. భవిష్యత్తులో డ్రగ్స్ సేవించబోమని, చదువు, కెరీర్ అభివృద్ధిపై దృష్టి పెడతామని అధికారులకు హామీ ఇచ్చారు. మళ్లీ ఇలాంటి ప్రవర్తన పునరావృతం చేయవద్దని, చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొంటే తగిన చట్టపరమైన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు.
Also Read
- TGCSB: మీ మనీ.. మీ క్లిక్.. మీ ఛాయిస్.. హెచ్చరికలు జారీ చేసిన సైబర్ క్రైమ్ బ్యూరో..
- Bharat Summit 2026: హైదరాబాద్ వేదికగా 'భారత్ సమ్మిట్-2026'.. అన్ని పార్టీల నేతలకు ఆహ్వానం..
- CM Revanth Reddy : పది మంది డీఎస్పీలు చాలు.. ప్రభుత్వ ప్రతిష్ట పెంచినా, తగ్గించినా
- Cloud Kitchens: క్లౌడ్ కిచెన్లలో ఆర్డర్ పెట్టుకుంటున్నారా..? తనిఖీల్లో మొత్తం బొద్దింకలు, పురుగులే..
కుటుంబ మద్దతు, కమ్యూనికేషన్, పర్యవేక్షణ యువతలో డ్రగ్స్ దుర్వినియోగాన్ని నివారించడంలో ఎంత కీలకమో తల్లిదండ్రులకు వివరించారు. తమ బిజీ షెడ్యూల్ వల్ల పిల్లల కార్యకలాపాలను పర్యవేక్షించడానికి కొంత వరకు సమయం, శ్రద్ధ తగ్గిందని తల్లిదండ్రులు అంగీకరించారు. ఇకపై పిల్లలతో ఎక్కువ సమయం గడుపుతామని, వారి ప్రవర్తన, స్నేహాలు, కార్యకలాపాలను దగ్గరగా పర్యవేక్షిస్తామని, డ్రగ్స్ కు దూరంగా ఉండేలా అవసరమైన మార్గదర్శకత్వం, భావోద్వేగ మద్దతు అందిస్తామని ఈగల్ ఫోర్స్ కు హామీ ఇచ్చారు. పరిస్థితి వారి భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపే ముందే సరైన సమయంలో జోక్యం చేసుకుని, పిల్లలకు కౌన్సెలింగ్ ఇచ్చి సానుకూల మార్గంలో నడిపించినందుకు ఈగల్ ఫోర్స్ అధికారులకు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ చొరవ ఎన్ ఫోర్స్ మెంట్ కు మించి అవగాహన, కౌన్సెలింగ్, కుటుంబ భాగస్వామ్యం, సకాలంలో జోక్యంపై దృష్టి పెట్టే తెలంగాణ ఈగల్ ఫోర్స్ నివారణ, సంస్కరణాత్మక విధానాన్ని ప్రతిబింబిస్తోంది.
తాజావార్తలు
-
Drug Awareness: ఇకపై డ్రగ్స్ జోలికి వెళ్లం.. గీతం యూనివర్సిటీ విద్యార్థుల ప్రతిజ్ఞ
-
Nidhi Aggerwal : చేతిలో ఒక్క హిట్ లేదు కానీ సెట్స్‌లో చుక్కలు చూపించిన హీరోయిన్..ఆగిపోయిన షూటింగ్?
-
US Credit Card Debt: బిల్లులు ఎగ్గొడుతున్న అమెరికన్లు.. పీకల్లోతు అప్పుల్లో అగ్రరాజ్యం!
-
TGCSB: మీ మనీ.. మీ క్లిక్.. మీ ఛాయిస్.. హెచ్చరికలు జారీ చేసిన సైబర్ క్రైమ్ బ్యూరో..
-
Babu Mohan: ‘దరిద్రం వెంటపడితే అంతే!’.. ది ప్యారడైజ్ టీమ్‌పై బాబు మోహన్ షాకింగ్ కామెంట్స్
ట్రెండింగ్
-
iPhoneకు పోటీగా Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. Motorola Razr Flex పేరుతో రంగం సిద్ధం..!
-
Captain Sanju Samson: పుట్టినరోజున కెప్టెన్‌గా సంజూ శాంసన్‌కు ప్రమోషన్..
-
Egg Lababdar Recipe: ఎగ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ డిష్.. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ “ఎగ్ లబాబ్దార్” సులువుగా చేసుకోండి ఇలా..!
-
How to Make Hara Saag: పప్పు తిని విసుగొచ్చిందా? తాజా ఆకుకూరలతో వింటర్ స్పెషల్ డిష్ ట్రై చేయండి..
-
IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్‌కు హార్థిక్ పాండ్యా.. ముంబైకి ఆర్షదీప్ సింగ్.. ఇట్స్ అఫీషియల్..!