Love: మా అమ్మాయి జోలికొస్తే అంతు చూస్తా.. మనస్తాపంతో ప్రియుడు ఆత్మహత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Love: యువత క్షణికావేశంలో ప్రాణాలు కోల్పోతున్నారు. తామేం చేస్తున్నామో.. అది సరియైనదా కాదా అని ఆలోచించకుండా, తల్లిదండ్రుల బాధ గురించి ఆలోచించకుండా హింసాత్మక మరణాల ఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఉద్యోగం రాకపోవడంతో కొందరు చనిపోతున్నారు, ప్రేమించినవారు మోసం చేశారని మరికొందరు ప్రేమికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మొబైల్ ఫోన్, బైక్ కొనలేదని ఇటీవల ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఇక తాజాగా తాను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన యువతికి వేరొకరితో నిశ్చితార్థం కావడంతో మనస్తాపానికి గురైన యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన శంషాబాద్ పరిధిలో చోటుచేసుకుంది.
Read also: Madhya Pradesh : పెళ్లి వేదికపై విషాదం.. విషం తాగిన వధువరులు
Also Read
- Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
- Jupally Krishna Rao : బార్ యజమానులకు షాక్.. ప్రివిలేజ్ ఫీజుపై జూపల్లి క్లారిటీ
- Cyber Crime Crackdown: సైబర్ ముఠాలపై బిగ్ ఆపరేషన్.. 100 మందికి పైగా అరెస్ట్..
- Bhatti Vikramarka : కరెంట్ డిమాండ్‌లో బిగ్ రికార్డ్.. 20 వేల మెగావాట్లకు చేరిక.!
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఆర్జెఏ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కొంతకాలంగా సిద్ధాంతి శివ అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమిస్తున్నాడు. అయితే విషయం తెలుసుకున్న యువతి కుటుంబ సభ్యులు ప్రియుడు శివను పిలిపించి అతని ఫోన్ లో ఉన్న ఫోటోలను డిలీట్ చేయించారు. మళ్లీ మా అమ్మాయి జోలికొస్తే అంతు చూస్తాము అని బెదిరించడంతో మనస్తాపం చెందిన శివ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానిక సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. కుటుంబ సభ్యులను ఆరా తీయగా.. శివను అమ్మాయి తరుపున బంధువులు బెదిరించారని మృతుడు కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీంతో శివ తీవ్ర మనస్తాపానికి లోనయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు. తన కొడుకు ఉన్నత చదువులు చదవి కుటుంబానికి అండగా ఉంటాడని ఆశతో వుంటే ప్రేమ తనను బలితీసుకుందని కన్నీరుమున్నీరయ్యారు. ఏసీపీ భాస్కర్ మాట్లాడుతూ.. కొత్వాల్ గూడ గ్రామానికి చెందిన శివ అనే యువకుడు చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని అన్నారు. కొత్వాల్ గూడ గ్రామానికి చెందిన యువతిని ప్రేమించిన విషయంలో ఇరుకుటుంబ సభ్యులకు గతంలో గొడవ జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. యువతి కుటుంబ సభ్యులు శివను బెదిరి ఇవ్వడంతో మనస్థాపకుడు చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. శివ పోస్టుమార్టం నిర్వహించిన డాక్టర్లు శివ ది ఆత్మహత్య అని తేల్చినట్లు ఏసీసీ భాస్కర్ వివరించారు. యువతి కుటుంబ సభ్యులపై చర్యలు చేపట్టాలని మృతుడు శివ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
Delhi: ఢిల్లీ తదుపరి సీఎస్ పీకే గుప్తా!.. కేంద్ర అనుమతిని కోరిన ఆప్ సర్కారు
తాజావార్తలు
-
SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
-
Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
-
Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
-
Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!