NTV Telugu Site icon

Love: మా అమ్మాయి జోలికొస్తే అంతు చూస్తా.. మనస్తాపంతో ప్రియుడు ఆత్మహత్య

Love Susaid

Love Susaid

Love: యువత క్షణికావేశంలో ప్రాణాలు కోల్పోతున్నారు. తామేం చేస్తున్నామో.. అది సరియైనదా కాదా అని ఆలోచించకుండా, తల్లిదండ్రుల బాధ గురించి ఆలోచించకుండా హింసాత్మక మరణాల ఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఉద్యోగం రాకపోవడంతో కొందరు చనిపోతున్నారు, ప్రేమించినవారు మోసం చేశారని మరికొందరు ప్రేమికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మొబైల్ ఫోన్, బైక్ కొనలేదని ఇటీవల ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఇక తాజాగా తాను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన యువతికి వేరొకరితో నిశ్చితార్థం కావడంతో మనస్తాపానికి గురైన యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన శంషాబాద్‌ పరిధిలో చోటుచేసుకుంది.

Read also: Madhya Pradesh : పెళ్లి వేదికపై విషాదం.. విషం తాగిన వధువరులు

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ ఆర్జెఏ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కొంతకాలంగా సిద్ధాంతి శివ అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమిస్తున్నాడు. అయితే విషయం తెలుసుకున్న యువతి కుటుంబ సభ్యులు ప్రియుడు శివను పిలిపించి అతని ఫోన్ లో ఉన్న ఫోటోలను డిలీట్ చేయించారు. మళ్లీ మా అమ్మాయి జోలికొస్తే అంతు చూస్తాము అని బెదిరించడంతో మనస్తాపం చెందిన శివ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానిక సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. కుటుంబ సభ్యులను ఆరా తీయగా.. శివను అమ్మాయి తరుపున బంధువులు బెదిరించారని మృతుడు కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీంతో శివ తీవ్ర మనస్తాపానికి లోనయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు. తన కొడుకు ఉన్నత చదువులు చదవి కుటుంబానికి అండగా ఉంటాడని ఆశతో వుంటే ప్రేమ తనను బలితీసుకుందని కన్నీరుమున్నీరయ్యారు. ఏసీపీ భాస్కర్‌ మాట్లాడుతూ.. కొత్వాల్ గూడ గ్రామానికి చెందిన శివ అనే యువకుడు చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని అన్నారు. కొత్వాల్ గూడ గ్రామానికి చెందిన యువతిని ప్రేమించిన విషయంలో ఇరుకుటుంబ సభ్యులకు గతంలో గొడవ జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. యువతి కుటుంబ సభ్యులు శివను బెదిరి ఇవ్వడంతో మనస్థాపకుడు చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. శివ పోస్టుమార్టం నిర్వహించిన డాక్టర్లు శివ ది ఆత్మహత్య అని తేల్చినట్లు ఏసీసీ భాస్కర్ వివరించారు. యువతి కుటుంబ సభ్యులపై చర్యలు చేపట్టాలని మృతుడు శివ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
Delhi: ఢిల్లీ తదుపరి సీఎస్‌ పీకే గుప్తా!.. కేంద్ర అనుమతిని కోరిన ఆప్ సర్కారు