NTV Telugu Site icon

Hospital Negligence: ప్రైవేట్ ఆస్పత్రి నిర్వాకం.. సైనస్ చికిత్సతో బాలిక మృతి

Katedhan

Katedhan

Girl died due to negligence of hospital: ప్రైవేటు ఆస్పత్రి నిర్వాహకం ఓ బాలిక ప్రాణాలు తీసింది. వైద్యం పేరుతో ఐదేళ్ల బాలిక మృతికి కారణం అయింది. రాజేంద్రనగర్ కాటేదాన్ లో ఈ ఘటన జరిగింది. ఈ నెల 29న అనారోగ్యంతో బాధపడుతున్న సాన్విక అనే ఐదేళ్ల బాలికను స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు తల్లిదండ్రులు. బాలిక సైనస్ తో బాధపడుతుందని వెంటనే ఆస్పత్రి చేయాలని వైద్యులు తల్లిదండ్రులకు చెప్పారు. తమ కూతురును ఎలాగైనా బతికించాలని ఆ కుటుంబం వైద్యులను వేడుకుంది. అయితే రెండు రోజులు ఐసీయూలో చికిత్స అందించారు. ఆ తరువాత బాలిక మరణించింది.

Read Also: Rishabh Pant: రిషబ్ పంత్‌ను రక్షించిన డ్రైవర్, కండక్టర్లకు సత్కారం..

బాలిక పరిస్థితి విషమించడంతో సదరు ఆస్పత్రి యాజమాన్యం నగరంలోని వేరే ఆస్పత్రికి అంబులెన్సులో తరలించారు. ఇదంతా తల్లిదండ్రులకు చెప్పకుండా ఆస్పత్రి జాగ్రత్త పడింది. అయితే వేరే ఆస్పత్రికి తరలించే సమయానికే సాన్విక మరణించిందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. బాలిక మృతదేహాన్ని కూడా అక్కడే వదిలేసి వచ్చింది సదరు ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యం. విషయం తెలియడంతో సాన్విక తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తమకు న్యాయం చేయాలని ఆస్పత్రి ముందు ఆందోళన నిర్వహించారు. అప్పటి వరకు ఆడుకుంటున్న తమ బిడ్డను ప్రైవేటు ఆస్పత్రి బలితీసుకుందని తల్లిదండ్రులు ఆరోపించారు. తమ బిడ్డ మరణానికి కారణం అయిన వైద్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆస్పత్రి వద్దకు చేరుకున్న మైలార్ దేవిపల్లి పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.