Site icon NTV Telugu

Dog Attack Child: బాలిక పై వీధి కుక్కుల దాడి.. పరిస్థితి విషమం

Dog Attack Child

Dog Attack Child

Dog Attack Child: వీధి కుక్కుల విహారంతో నగరంలో భయం వాతావరణం చోటు చేసుకుంది. వీధిలో పిల్లలను బయటకు వదలాలంటేనే తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా కూడా వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. వీధిలో కనబడిన అందరిపై కూడా దాడికి పాల్పడుతూ గాయాల పాలు చేస్తున్న ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. ఎక్కడైనా వీధి కుక్కలు కనిపించాయి అంటే చాలు ప్రతి ఒక్కరు భయపడిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అభం శుభం తెలియని చిన్నారులపై దారుణంగా దాడి చేస్తున్న ఘటనలు ప్రతి ఒక్కరిని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. ఇక ఇటీవల కొంపల్లిలో జరిగిన ఓచిన్నారిపై వీధికుక్కల దాడి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో నగర వాసులకు భయాందోళనకు గురవుతున్నారు.

Read also: Cheguera Daughter: హైదరాబాద్ కు రానున్న చెగువేరా కూతురు.. ఎప్పుడంటే?

హైదరాబాద్‌ లోని మాలకుంట బావి, కొంపల్లి తమ నివసించే అప్పలరాజు, శ్యామల దంపతులకు ఐదేళ్ల తనుశ్రీ ఉంది. తనుశ్రీ ఇంటి ముందు ఆడుకుంటూ ఉండగా ఒక్కసారిగా తనుశ్రీపై వీధి కుక్కలు విరుచుకుపడ్డారు. తనుశ్రీపై కనిపడిన చోటల్లా దాడి చేశాయి. వీచక్షణారహితంగా పీక్కుతిన్నాయి. తనుశ్రీను కాళ్లు చేతులు మెడ లాగుతూ ఎక్కడపడితే అక్కడ దాడికి దిగాయి. తనుశ్రీ గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు కుటుంబ సభ్యలు బయటకు వచ్చారు. కుక్కటను తరమి కొట్టేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. చిన్నారిని విచక్షణా రహితంగా దాడి చేస్తూ చేతులు కాళ్లు కంటి వద్ద తీవ్రంగా గాయపరిచారు. స్థానికులు, కుటుంబ సభ్యులు తీవ్రంగా ప్రయత్నించి కుక్కలను తరిమి కొట్టారు. అయితే అప్పటికే చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. తల్లిదండ్రులు హుటాహుటిన నగరంలోని నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పోందుతున్న 5సంవత్సరాల చిన్నారి తనుశ్రీ పరిస్థితి ఆందోళన కరంగా ఉందని వైద్యులు తెలిపారు. మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
Acidity: కడుపులో మంటగా ఉందా? ఈ చిట్కాలు పాటించండి..

Exit mobile version