Site icon NTV Telugu

GHMC : జీహెచ్‌ఎంసీ టౌన్‌ ప్లానింగ్‌లో భారీగా బదిలీలు

Ghmc

Ghmc

GHMC : హైదరాబాద్‌ బల్దియా పరిధిలోని టౌన్ ప్లానింగ్ శాఖలో శుభ్రపరిచే చర్యలకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ శ్రీకారం చుట్టారు. అధికారులపై వస్తున్న అవినీతి ఆరోపణలు, కొందరి‌పై ఏసీబీ వలలో చిక్కిన ఘటనల నేపథ్యంలో శనివారం మొత్తం 27 మంది అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మార్పుల్లో 13 మంది అసిస్టెంట్ సిటీ ప్లానర్లు (ACP), 14 మంది సెక్షన్ ఆఫీసర్లు ఉన్నారు. కొన్ని చోట్ల ప్రమోషన్లు కూడా ఇచ్చారు. పని తీరును దృష్టిలో పెట్టుకొని తీసుకున్న ఈ నిర్ణయం టౌన్ ప్లానింగ్‌లో పారదర్శకతకు బాటలు వేస్తుందని భావిస్తున్నారు.

Rashmika : ఈ ప్రశంసలన్నీ శేఖర్ కమ్ముల వల్లే..రష్మిక ఎమోషనల్ పోస్ట్

కీలక బదిలీలు ఇలా:

కృష్ణమూర్తి (మెహదీపట్నం) → ఉప్పల్

పావని (కార్వాన్) → సికింద్రాబాద్

సుధాకర్ (SO) → ACP, చంద్రయాన్ గుట్ట

లాలప్ప (తాండూర్) → శేరిలింగంపల్లి జోన్

జీషన్ (SO) → ACP, కూకట్‌పల్లి

భానుచందర్ (చంద్రయాన్ గుట్ట) → సంతోష్‌నగర్

మంజుల సింగ్ (గోషామహల్) → కులీ కుతుబ్ షా అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ

స్వామి (సంతోష్‌నగర్) → మెహదీపట్నం

సెక్షన్ ఆఫీసర్ల మార్పులు:

రమేష్ (SO) → కుత్బుల్లాపూర్ నుండి చందానగర్

అగ్బర్ అహ్మద్ (SO) → హయత్‌నగర్ నుండి శేరిలింగంపల్లి

సురేష్ కుమార్ (SO) → ఉప్పల్ నుండి జూబ్లీ హిల్స్

మహేందర్ (SO) → ఫలక్నుమా నుండి ఘోషామహల్

తుల్జాసింగ్ → గాజులరామారం నుండి ఉప్పల్

BV ప్రకాష్ → కార్వాన్ నుండి మెహదీపట్నం

ముకేష్ సింగ్ → చార్మినార్ నుండి గాజుల రామారం

ఈ బదిలీలతో పాటు ఖాళీల భర్తీ, పనితీరు ఆధారంగా ప్రమోషన్లను బల్దియా చేపట్టింది. ప్రజావాణిలో అధిక ఫిర్యాదులు టౌన్ ప్లానింగ్ విభాగంపై రావడంతో, ఇకపై ప్రజల సమస్యలు తక్షణమే పరిష్కారమవుతాయన్న ఆశలు వ్యక్తమవుతున్నాయి. కమిషనర్ ఆర్వీ కర్ణన్ అధికారులందరికీ వ్యక్తిగతంగా బదిలీ ఉత్తర్వులు అందజేశారు. ఈ చర్యలు టౌన్ ప్లానింగ్ శాఖపై ప్రజల నమ్మకాన్ని పునరుద్ధరించేందుకు కీలకమవుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

Meta Oakley smart glasses: మెటా కొత్త స్మార్ట్ గ్లాసెస్ విడుదల.. ఫోన్ కాల్స్, మ్యూజిక్ వినొచ్చు!

Exit mobile version