Site icon NTV Telugu

Electric Vehicle: ఎలక్ట్రిక్ వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. గ్రేటర్‌లో పబ్లిక్‌ ఛార్జింగ్‌ సెంటర్లు..!

Charging Station

Charging Station

క్రమంగా పెరిగిపోతున్న పెట్రో ధరలతో ప్రజలు ప్రత్యామ్నాయాలపై దృష్టిసారిస్తున్నారు.. అందులో భాగంగానే ఎలక్ట్రిక్‌ వాహనాలను ఆశ్రయిస్తున్నారు.. ఎలక్ట్రిక్‌ బైక్‌లు, కార్లు సైతం హైదరాబాద్‌ రోడ్లపై దర్శనమిస్తున్నాయి.. అయితే, వాటిని సదరు వినియోగదారుడు ఇంట్లోనే ఛార్జింగ్‌ పెట్టుకోవాల్సి వస్తుంది.. బయటకు వెళ్లే ఛార్జింగ్‌ సెంటర్లు పెద్దగా అందుబాటులో ఉన్న పరిస్థితి లేదు.. దీంతో ఎలక్ట్రిక్‌ వాహనదాలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.. ఎక్కడికి వెళ్లినా.. ఛార్జింగ్‌ కిట్‌ను వెంట తీసుకెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేసేవారు కూడా ఉన్నారు.. అంటే, ఎక్కడికైనా వెళ్తే.. వారికి తెలిసినవారిని అడిగి.. ఛార్జింగ్‌ పెట్టుకుని మళ్లీ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారట.. కానీ, ఇక, ఇప్పుడు నో టెన్షన్‌.. ఎందుకంటే.. ఎలక్ట్రిక్‌ వాహనదారులకు గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) గుడ్‌ న్యూస్‌ చెప్పింది.

Read Also: Four-level security: ప్రధాని మోడీ హైదరాబాద్‌ టూర్.. నాలుగు అంచల భద్రత ఏర్పాటు..

గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో ఎలక్ట్రిక్ వాహనాల కోసం పబ్లిక్ ఛార్జింగ్ సెంటర్ల ఏర్పాటుకు పూనుకుంది.. జీహెచ్‌ఎంసీ పరిధిలో మొత్తంగా 230 ఛార్జింగ్ పాయింట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు అధికారులు.. ఇక, హెచ్‌ఎండీఏ పరిధిలో మరో 100 ఛార్జింట్‌ సెంటర్ల ఏర్పాటుకు ప్రతిపాధనలున్నాయి.. ప్రయోగాత్మకంగా హైదరాబాద్‌ సిటీలో మొదట 14 పబ్లిక్ ఛార్జింగ్ సెంటర్స్‌ అందుబాటులోకి రానున్నాయి.. మొత్తంగా ఇవి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే.. ఎలక్ట్రిక్‌ వాహనాల సంఖ్య మరింత పెరిగే అవకాశం లేకపోలేదు.. పెట్రో ధరలు ఇప్పుడు ఆగినా.. మళ్లీ పెరిగే అవకాశాలు ఉండగా.. మరోవైపు, పెట్రో వాహనాలు పర్యావరణానికి తూట్లు పొడుస్తున్నాయి.. దీంతో, ఎలక్ట్రిక్‌ వాహనాలకు డిమాండ్‌ పెరుగుతోన్న విషయం తెలిసిందే.. అయితే, కొన్ని ప్రాంతాల్లో ఎలక్ట్రిక్‌ వాహనాలు ప్రమాదానికి గురికావడం.. బ్యాట్రీలు పేలడం, మంటలు అంటుకోవడం లాంటి ఘటనలో కొంత భయం కూడా ఉంది.

Exit mobile version