Site icon NTV Telugu

Complaints to GHMC: కుక్కలు బాబోయ్‌ కుక్కలు.. జీహెచ్‌ఎంసీకి 36 గంటల్లో 15వేల కంప్లైంట్స్‌

Dogs

Dogs

Complaints to GHMC: హైదరాబాద్ జీహెచ్‌ఎంసీకి కుక్కల బెడద ఎక్కువైంది. తమ వీధుల్లో కుక్కలపై ఫిర్యాదులు రావడంతో జీహెచ్‌ఎంసీకి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. బల్దియాకు కేవలం 36 గంటల్లోనే 15 వేల ఫిర్యాదులు అందాయి. సగటున గంటకు 416 ఫిర్యాదులు అందుతున్నాయి. అంబర్ పేట్ బాలుడి ఘటన తర్వాత నగరంలో కుక్కల సమస్యపై ప్రజలు వాపోతున్నారు. 500 వీధికుక్కలు జీహెచ్ ఎంసీ పరిధిలోని అన్ని జోన్లలో ఇప్పటివరకు 500 వీధికుక్కలను జీహెచ్ ఎంసీ సిబ్బంది పట్టుకున్నారు. కానీ నగరంలో 5 లక్షలకు పైగా కుక్కలు ఉన్నట్లు అంచనా. వారిని పట్టుకునేందుకు సమయం పడుతుందని చెబుతున్నారు. అయితే అంబర్ పేటలో ఓ బాలుడిపై కుక్కలు దాడి చేసి చంపడంతో నగరంలో ఆందోళన నెలకొంది.

Read also: Kondagattu Chori: కొండగట్టు చోరీ కేసు.. దొంగలు ఆలయంలో ఎలా వెళ్లారంటే..

ఇక జీహెచ్‌ఎంసీలో కుక్కకాటు బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కుక్కకాటు చికిత్స కోసం వందలాది మంది బాధితులు హైదరాబాద్ నారాయణగూడ ప్రివెంటివ్ సెంటర్‌కు చేరుకుంటున్నారు. సాధారణంగా నారాయణగూడ ప్రివెంటివ్ సెంటర్‌కు రోజుకు 500 మంది చికిత్స కోసం వస్తుంటారు. కానీ ఇటీవలి కాలంలో ఈ సంఖ్య పెరుగుతోందని వైద్య సిబ్బంది చెబుతున్నారు. జీహెచ్ ఎంసీ పరిధిలోనే కాకుండా హైదరాబాద్ సమీపంలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా వైద్యం కోసం ఈ కేంద్రానికి వస్తుంటారు. రెండు రోజుల క్రితం హైదరాబాద్ అంబర్ పేటలో నాలుగేళ్ల ప్రదీప్ కుక్క దాడిలో తీవ్రంగా గాయపడి చనిపోయాడు. ఈ ఘటనతో అధికారుల్లో కదలిక వచ్చింది. అంబర్ పెట్ ఘటనే కాకుండా.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వీధికుక్కల దాడి ఘటనలు చోటుచేసుకున్నాయి. హైదరాబాద్ చైతన్యపురి మారుతీనగర్‌లో నాలుగేళ్ల బాలుడిపై వీధికుక్కలు దాడి చేశాయి. రోడ్డుపై వెళ్తున్న ఓ వాహనదారుడు కుక్కలను తరిమికొట్టాడు. దీంతో ప్రమాదం తప్పింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా శంకరపట్నంలోని ఎస్సీ హాస్టల్‌లో సుమన్ అనే విద్యార్థిపై కుక్క దాడి చేసింది. వీణవంక మండలం మల్లారెడ్డి గ్రామంలో యేసయ్య అనే వ్యక్తిపై కుక్క దాడి చేయడంతో వాహనదారుడు యేసయ్య గాయపడ్డాడు.

Read also: Bandi sanjay: ప్రీతి కేసును తప్పుదోవ పట్టిస్తున్నారు

నిజామాబాద్‌ జిల్లా ఇందల్‌వాయి మండల కేంద్రానికి చెందిన గంగాధర్‌ నాలుగేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌కు వలస వచ్చాడు. అంబర్‌పేట ఛే నంబరు చౌరస్తాలో ఉన్న ఓ కారు సర్వీస్‌ సెంటర్‌లో వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు. భార్య జనప్రియ, ఆరేళ్ల కుమార్తె, నాలుగేళ్ల కుమారుడు ప్రదీప్‌లతో కలిసి బాగ్‌అంబర్‌పేట ఎరుకుల బస్తీలో నివాసం ఉంటున్నారు. ఆదివారం హాలిడే కావడంతో గంగాధర్‌ పిల్లలిద్దర్నీ తాను పని చేస్తున్న సర్వీస్‌ సెంటర్‌‌కు తీసుకువచ్చాడు. కుమార్తెను పార్కింగ్‌ ప్రదేశం వద్ద ఉన్న క్యాబిన్‌లో ఉంచి, కుమారుడిని సర్వీస్‌ సెంటర్‌ లోపలికి తీసుకెళ్లాడు. కుమారుడు అక్కడే ఆడుకుంటూ ఉండటంతో మరో వాచ్‌మన్‌తో కలిసి పని మీద బయటకు వచ్చాడు. కాసేపు అక్కడే ఆడుకున్న ప్రదీప్‌, తర్వాత అక్క కోసం క్యాబిన్‌ వైపు నడుచుకుంటూ వస్తుండగా వీధి కుక్కలు వెంటపడ్డాయి. భయపడిన బాలుడు వాటి నుంచి తప్పించుకునేందుకు అటు ఇటూ పరుగులు తీసినా అవి వదల్లేదు. ఒకదాని తర్వాత ఒకటిగా బాలుడిపై దాడిచేశాయి. రెండు కుక్కలు చెరోవైపు లాగడంతో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. తమ్ముడి ఆర్తనాదాలు విని తండ్రికి సమాచారమిచ్చింది. గంగాధర్ వాటిని వెళ్లగొట్టడంతో బాలుడిని వదిలేశాయి. తీవ్ర గాయాలపాలైన కుమారుడిని తండ్రి ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
Harish Rao: ప్రీతి కుటుంబ సభ్యులకు హరీశ్‌ పరామర్శ.. దోషులను శిక్షిస్తామ‌ని హామీ

Exit mobile version