Site icon NTV Telugu

GHMC : జీహెచ్‌ఎంసీ విస్తరణకు గవర్నర్ గ్రీన్‌సిగ్నల్.!

Ghmc

Ghmc

GHMC : జీహెచ్‌ఎంసీ విస్తరణకు కీలకమైన ‘మున్సిపాలిటీల విలీన ఆర్డినెన్స్‌’పై గవర్నర్‌ ఆమోదం తెలిపారు. ఫైల్‌ ప్రభుత్వానికి చేరడంతో, తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే గెజిట్‌ విడుదల చేయనుంది. ఇటీవల రాష్ట్ర మంత్రివర్గం జీహెచ్‌ఎంసీ పరిధిని విస్తరించే తీర్మానం చేసింది. హైదరాబాద్‌ కోర్‌ అర్బన్‌ ఏరియాకు ఆనుకొని ఉన్న మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్లన్ని జీహెచ్‌ఎంసీలో విలీనం చేసే ప్రతిపాదనకు కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.

ఔటర్ రింగ్ రోడ్‌ (ఓఆర్‌ఆర్‌) లోపల, బయట ఉన్న 27 పురపాలక సంస్థలను జీహెచ్‌ఎంసీ పరిధిలో చేర్చేందుకు ఆమోదం తెలిపింది. ఈ విలీనానికి అనుగుణంగా జీహెచ్‌ఎంసీ చట్టం, తెలంగాణ మున్సిపాలిటీల చట్టాలలో సవరణలు చేయాలని కూడా నిర్ణయించింది.

జీహెచ్‌ఎంసీలో విలీనం కానున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు:

మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా : బోడుప్పల్, పీర్జాదిగూడ, జవహర్‌నగర్, నిజాంపేట్, దమ్మాయిగూడ, నాగారం, పోచారం, ఘట్‌కేసర్, గుండ్లపోచంపల్లి, మేడ్చల్, తూముకుంట, కొంపల్లి, దుండిగల్

రంగారెడ్డి జిల్లా : 
బడంగ్‌పేట్, బండ్లగూడ జాగీర్, మీర్‌పేట్, పెద్ద అంబర్‌పేట్, జల్‌పల్లి, శంషాబాద్, తుర్కయాంజాల్, నార్సింగి, మణికొండ, ఆదిభట్ల, తుక్కుగూడ

సంగారెడ్డి జిల్లా : బొల్లారం, తెల్లాపూర్, అమీన్‌పూర్

ఈ విలీనంతో హైదరాబాద్‌ పరిపాలనా విస్తీర్ణం భారీగా పెరగనుంది, నగర అభివృద్ధి ప్రణాళికలు మరింత సమగ్రంగా అమలు చేసే అవకాశం ఉంది.

Exit mobile version