NTV Telugu Site icon

టీఆర్ఎస్‌కు గట్టు రాజీనామా.. మీ అభిమానం పొందలేకపోయా..!

తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్‌ పార్టీకి రాజీనామా చేశారు ఆ పార్టీ నేత గట్టు రామచంద్రరావు… టీఆర్ఎస్‌ పార్టీలో చురుకుగా పనిచేసిన ఆయన.. గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా కనిపించడంలేదు.. అయితే, పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.. టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌కు లేఖరాసిన గట్టు రామచంద్రరావు… “నేను మీ అభిమానాన్ని పొందడంలో.. గుర్తింపు తెచ్చుకోవడంలో విఫలమయ్యాను.. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీలో కొనసాగడం కరెక్టు కాదని భావించాను.. అందుకే పార్టీకి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నారు.. ఆమోదిస్తారని ఆశిస్తున్నాను.. ఇప్పటి వరకు నన్ను గౌరవించిన మీకు, పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అంటూ ఆ లేఖలో పేర్కొన్నారు. కాగా, కమ్యూనిస్టు పార్టీలో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన గట్టు రామచంద్రరావు.. క్రమంగా రాష్ట్రస్థాయి నేతగా ఎదిగారు.. ఆ తర్వాత వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన ఆయన.. అక్కడి నుంచి టీఆర్ఎస్‌ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.. ఇప్పుడు టీఆర్ఎస్‌కు కూడా గుడ్‌బై చెప్పేశారు గట్టు.

Read Also : టీఆర్ఎస్‌ ఖాతాలో మరో ఎమ్మెల్సీ.. వరంగల్‌ ఏకగ్రీవం..