Garikapati Narasimha Rao: చిరంజీవి ఫోటో సెషన్ ఆపకపోతే.. నేను వెళ్లిపోతా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Garikapati Narasimha Rao Got Furious Over Chiranjeevi Photo Session In Alai Balai: హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో అట్టహాసంగా ప్రారంభమైన ‘అలయ్ బలయ్’ వేడుకల్లో ఒక అనూహ్యమైన పరిణామం చోటు చేసుకుంది. తాను ప్రసంగిస్తున్న సమయంలోనే.. ఈ వేడుకకి ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి ఫోటో సెషన్ ప్రారంభమైంది. దీంతో అటెన్షన్ మొత్తం అటువైపు వెళ్లిపోయింది. కెమెరామెన్లు, ఫోటో దిగాలనుకున్న అభిమానులందరూ.. చిరుని చుట్టుముట్టేశారు. ఈ పరిణామంతో కాస్త ఆగ్రహానికి లోనైన గరికపాటి.. ‘అటువైపు జరుగుతున్న ఫోటో సెషన్‌ని ఆపేయాలి, లేకపోతే నేను వెళ్లిపోతాన’ని అన్నారు. అనంతరం.. ‘చిరంజీవి, దయచేసి అక్కడ మీరు ఫోటో సెషన్ ఆపేసి ఇటువైపుకి రండి, నేను ప్రసంగాన్ని కొనసాగిస్తాను’ అని చెప్పారు. అనంతరం సిబ్బంది వచ్చి అటువైపుగా కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేయగా, తన ప్రసంగాన్ని ఆపేసి గరికపాటి చిరు ఫోటోసెషన్ వైపుకి వెళ్లి కూర్చున్నారు. ఇంతలో చిరు తన ఫోటోసెషన్ ఆపేసి, ఆయన పక్కన కూర్చున్నారు. అప్పుడు మళ్లీ తన ప్రసంగాన్ని తిరిగి ప్రారంభించారు గరికపాటి. అయితే.. ఈ వ్యవహారంలో గరికపాటి నొచ్చుకోకుండా, చాలా కూల్‌గా ఉండటం ఆయన వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది.
ఇదిలావుండగా.. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మీ ఆధ్వర్యంలో ఈ అలయ్ బలయ్ వేడుకలు కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమానికి హాజరైన మెగాస్టార్ చిరంజీవి డోలు వాయిస్తూ హాజరయ్యారు. మెడలో డోలు వేసుకుని.. ఉత్సాహంగా డోలు వాయించిన ఆయన, స్టెప్పులు కూడా వేశారు. పక్కనే ఉన్న బండారు దత్తాత్రేయ కూడా.. చిరుతో పాటు డోలు వాయిస్తూ, స్టెప్పులేశారు. దీంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్‌రావు, కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు, మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు, గరికపాటి నరసింహారావు, భాజపా నేతలు వివేక్, కొండా విశ్వేశ్వర రెడ్డి, సినీ నటుడు బాబూమోహన్, ఎమ్మెల్యే రఘునందనరావు, సంగీత దర్శకురాలు శ్రీలేఖ తదితరులు హాజరయ్యారు.
Also Read
- Used Oil: హైదరాబాద్ హోటల్స్‌లో వాడిన నూనెను మళ్లీ మళ్లీ వాడేస్తున్నారు.. ఫ్రీజర్‌లో కుళ్లిపోయిన ఆహారం..
- In Service Teachers TET: బిగ్ అలర్ట్.. అక్టోబర్ 1న మరో టెట్ నోటిఫికేషన్..
- 22A Registrations: తెలంగాణలో 22-A ఆస్తుల రిజిస్ట్రేషన్లకు గ్రీన్ సిగ్నల్.. కానీ షరతులు వర్తిస్తాయ్..
- New Bus Stands: ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త.. తెలంగాణలో మరో 13 కొత్త బస్టాండ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
చిరంజీవి గారు మీ ఫోటో సెషన్ ఆపితే నేను మాట్లాడాలి – ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచన కర్త గరికపాటి నరసింహారావు#GarikapatiNarasimhaRao #Chiranjeevi #MegastarChiranjeevi #AlaiBalai #Nampally #Hyderabad #NTVTelugu pic.twitter.com/X0Av64Jufj
— NTV Telugu (@NtvTeluguLive) October 6, 2022
తాజావార్తలు
-
CEC Impeachment: CEC జ్ఞానేష్ కుమార్‌ను తొలగించడం అంత ఈజీ కాదు.. రాజ్యాంగం ఏం చెబుతోంది.?
-
Banks Merged: ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. మరో రెండు బ్యాంకులు విలీనం..!
-
Tejasvi Surya: జీన్ జీ అయినా.. ఎవరైనా నిజాయితీ నాయకులనే కోరుకుంటారు
-
Mohan Babu: “నాని పర్మిషన్తో నన్ను పెట్టుకోవడానికి వచ్చావా? అక్కడ కొట్టింది నా ఈగో”
-
Iran-US: అమెరికాకు ఇరాన్ తాజా హెచ్చరిక.. ఈసారి చిన్న తప్పు చేసినా..!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?