Koti Deepotsavam Day 5: హైదరాబాద్‌లో భక్తి తరంగాలు ఉప్పొంగుతున్నాయి. ఏటా కార్తీకమాసం సందర్భంగా ఎన్టీవీ, భక్తి టీవీ, వనిత టీవీ ఆధ్వర్యంలో నిర్వహించే కోటి దీపోత్సవం 2025 మహోత్సవం నాలుగవ రోజు భక్తి వాతావరణంలో సాగింది. వేలాది మంది భక్తులు ఎన్టీఆర్ స్టేడియంలో దీపాలు వెలిగిస్తూ “ఓం నమః శివాయ” నినాదాలతో భక్తి కాంతులతో వెలుగులు నింపారు. 2012లో లక్ష దీపోత్సవంగా ప్రారంభమై, 2013లో కోటి దీపోత్సవంగా రూపాంతరం పొందిన ఈ మహోత్సవం, ప్రతి ఏడాది…
Padma Shri Garikapati Narasimha Rao: మహా సహస్రావధాని, ఆధ్యాత్మిక వేత్త, పద్మశ్రీ గరికపాటి నరసింహారావు గురించి తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరు. తెలుగు వాళ్లు ఎక్కడ ఉన్నా.. ఆయన అవధానాలు వినే ఉంటారు. వ్యక్తిత్వ వికాసంపై ఆయన ఇచ్చే సందేశాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా యువత గరికపాటి సందేశాలను బాగా ఇష్టపడతారు. ప్రస్తుత సమాజానికి తగ్గట్టు మాట్లాడటం, ఏదేని విషయాన్ని కుండ బద్ధుల గొట్టినట్లు వివరించడం యువతను కట్టి పడేస్తుంది.
దేశ రాజధాని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో సోమవారం నాడు పద్మ పురస్కారాల ప్రదానం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. పద్మ అవార్డుల విజేతలు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మ పురస్కారాలను అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ ప్రవచన కర్త, ఏపీకి చెందిన గరికపాటి నరసింహారావు రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. అవార్డు అందుకున్న వారి జాబితాలో మొగులయ్య కూడా ఉన్నారు. మరోవైపు భారత…
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప’ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ముఖ్యంగా బాలీవుడ్ లో ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. హిందీలో సంచలనం సృష్టించి వార్తల్లో నిలిచిన ‘పుష్ప’రాజ్ తాజాగా గరికపాటి వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచాడు. ఈ సినిమా వల్ల నేరాలు పెరుగుతున్నాయి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు గరికపాటి. అయితే తాజాగా సినీ ఫక్కీలో ఓ యువకుడు స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోగా… ఆ…
ప్రముఖ తెలుగు రచయిత, అవధాని, ఉపన్యాసకుడు గరికపాటి నరసింహారావు పద్మశ్రీ అవార్డు వచ్చిన సందర్భంగా ఆయన ఎన్టీవీతో మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన పలు కీలక విషయాలను ఎన్టీవీతో పంచుకున్నారు.నాకు పద్మశ్రీ అవార్డు రావడం సంతోషంగా ఉందని గరికపాటి అన్నారు. నా ప్రసంగాలు యువత, సమాజంలో మార్పు తీసుకువస్తే చాలన్నారు. పద్మశ్రీ అవార్డు కోసం ఎలాంటి దరఖాస్తు చేసుకోలేదని, కానీ రెండు రాష్ట్ర ప్రభుత్వాల కృషి అభినందనీయమని ఈ సందర్భంగా గరికపాటి నరసింహరావు అన్నారు. Read Also: కొత్త…