NTV Telugu Site icon

Gangula Kamalakar: తెలంగాణలో పాదయాత్రలతో కొందరు.. కోతి వేషాలతో కేఏ పాల్

Gangulakamalakar

Gangulakamalakar

Gangula Kamalakar: కరీంనగర్ జిల్లాలోని పాదయాత్రలతో కొందరు.. కోతి వేషాలతో కేఏ పాల్ లాంటి వారు తెలంగాణకు వస్తున్నారని మంత్రి గంగుల కమలాకర్ తీవ్ర విమర్శలు చేశారు. 16వ డివిజన్ లో 44 లక్షలతో నిర్మించనున్న సిసి రోడ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఢిల్లీ పాలకులు ఎంత విషం చిమ్మిన తెలంగాణ అభివృద్ధి ఆగదని మండిపడ్డారు. తొమ్మిదేళ్ళ పాలనలో కరీంనగరాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. 24 గంటల తాగు నీరు మా లక్ష్యం అని గంగుల కమలాకర్‌ అన్నారు. పర్యాటకులు కరీంనగర్ కు వచ్చేలా కేబుల్ బ్రిడ్జ్, మానేరు రివర్ ఫ్రంట్ నిర్మిస్తున్నామన్నారు. ఆంధ్ర పార్టీలు తెలంగాణకు అవసరమా? అని ప్రశ్నించారు. పాదయాత్రలతో కొందరు.. కోతి వేషాలతో కేఏ పాల్ లాంటి వారు తెలంగాణకు వస్తున్నారని మంత్రి తీవ్ర విమర్శలు చేశారు.

Read also: Falls Into Pond: చెరువులో పడి తల్లీకూతుళ్లు మృతి.. గాలింపు చేపట్టిన వ్యక్తి..!

సమైక్య పాలన ఇదివరకే చూశాం.. మళ్ళీ మీ పాలన అవసరంలేదని అన్నారు. దేశానికి ప్రధానిగా ఉన్న మోడీ ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడటం సరికాదని తెలిపారు. సీఎం కేసీఆర్ కు ప్రధాని కార్యాలయం ఆహ్వానం పంపకపోవడం ఇదేనా బీజేపీ సంస్కృతి అని ప్రశ్నించారు. జీఎస్టీ మేము కడితే ఫలాలు మాత్రం గుజరాత్ కా? అని మండిపడ్డారు. ప్రధాని రామగుండంలో కొత్తగా ఏమైనా కర్మాగారాలు ప్రకటిస్తారని అనుకుంటే కేవలం రాజకీయాలే మాట్లాడారని అన్నారు. ఢిల్లీ పాలకులకు తెలంగాణపై వివక్ష ఎందుకు? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దక్షిణ భారత దేశంలో బీజేపీకి తిరిగి చుక్కెదురు కాక తప్పదు అని విమర్శించారు. దేశానికి ప్రధానిగా ఉన్న వ్యక్తి అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలి.. సంపద అందరికీ పంచాలని గుర్తు చేశారు.
Falls Into Pond: చెరువులో పడి తల్లీకూతుళ్లు మృతి.. గాలింపు చేపట్టిన వ్యక్తి..!