Gang War: హైదరాబాద్‌లో గ్యాంగ్ వార్ కలకలం సృష్టించింది. పాతబస్తీలోని భవానీనగర్ ప్రాంతంలో రైలు ప్రమాదం జరిగింది. పట్టాలపై కొందరు యువకులు గ్యాంగ్ వార్ కు దిగారు. కొట్లాటల మత్తులో రైలు రావడం కూడా గమనించలేదు. దీంతో రైలు ఢీకొనడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రాంతంలో ఇలాంటి గ్యాంగ్ వార్‌లు సర్వసాధారణంగా మారాయని స్థానికులు అంటున్నారు.
Read also: Vijayawada: ఆటో డ్రైవర్ నిజాయితీ.. ప్రయాణికురాలి నగలు బ్యాగు అప్పగింత
అసలేం జరిగింది..
హైదరాబాద్ పాతబస్తీలోని భవాని నగర్ గంజాయి అమ్మాకాలకు అడ్డగా మారింది. గంజాయి మత్తులో యువకులు హల్ చల్ సృష్టిస్తున్నారు. గంజాయి మత్తులో వున్న యువకుల వల్ల ఏం జరుగుతుందో ఏమో అంటూ స్థానికులు బిక్కు బిక్కు మంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నారు. అయితే నిన్న అర్థరాత్రి భవాని నగర్ రైల్వే ట్రాక్ పై గంజాయి మత్తులో గ్యాంగ్ వార్ జరిగింది. అయితే ఈ గొడవ జరుగుతున్న సమయంలో అక్కడి నుంచి వస్తున్న ట్రైన్ ను గమనించలేదు. రైలు ఢీకొడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో కొందరు గంజాయి గ్యాంగ్ అక్కడి నుంచి పరారయ్యారు. రైల్వే ట్రాక్ పై కొందరు రెండు మృతదేహాలను గమనించి రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనా స్థలికి హుటా హుటిన చేరుకున్న రైల్వే పోలీసులు వారిద్దిరి మృతదేహాలను మార్చురీకి తరలించారు. భవానీనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ ఇద్దరు మృత దేహాలు ఎవరివి అని ఇంకా స్పష్టత రాలేదని తెలిపారు. త్వరలో గంజాయి గ్యాంగ్ ను పట్టుకుంటామని అన్నారు.
ఇక మరోవైపు ఈ రైల్వే ట్రాక్ పై తరచూ మద్యం, గంజాయి మత్తులో గొడవలు దాడులు జరిగి హత్యలు, ఆత్మహత్యలు ఘటనలు జరిగాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టైన్ వస్తున్న పట్టించుకోకుండా గ్యాంగ్ వార్ జరిగిందంటే.. వారు ఎంతగా గంజాయి మత్తులో ఉంటారో అర్థం చేసుకోవాలని స్థానికులు తెలిపారు. అంతేకాకుండా.. వారి వల్ల చుట్టుపక్కల ఇళ్లవారు బయటకు భయంతో బయటకు రాలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పోలీసులు వీరి పై నిఘాపెట్టాలని కోరుతున్నారు. భవాని నగర్ లో గంజాయితో స్థానిక ప్రజలకు ఇబ్బంది పెడుతున్నారని, ఏ సమయంలో ఏం జరుగుతుందో బయటకు రావాలంటేనే భయంగా వుందని వాపోతున్నారు. పోలీసులు ఇలాంటి వారిపై నిఘాపెట్టి వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.
Andhra Pradesh: వాలంటీర్లకు ప్రభుత్వం గుడ్‌న్యూస్