NTV Telugu Site icon

Gang of Fake Certificates: నకిలీ సర్టిఫికెట్ల ముఠా అరెస్ట్.. వందకు పైగా..

Gang Of Fake Certificates

Gang Of Fake Certificates

నకిలీ ఎడ్యుకేషన్‌ సర్టిఫికెట్స్‌ ముఠాను మాదాపూర్ ఎస్వోటి పోలీసులు అదుపులో తీసుకున్నట్లు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. గచ్చిబౌలి సైబరాబాద్ సీపీ ఆఫీస్ ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు. 11 మంది అరెస్ట్ చేసామని పేర్కొన్నారు. వారి వద్ద నుంచి భారీగా నకిలీ సర్టిఫికెట్స్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ గ్యాంగ్ లో ప్రధాన నిందితుడు కోట కిషోర్ కుమార్ తో పాటు 10 మందిని అదుపులో తీసుకున్నట్లు పేర్కొన్నారు. సుమారు 18 యూనివర్సిటీ లకు సంబందించినవి ఫేక్ సర్టిఫికేట్స్ ఈగ్యాంగ్ తయారు చేసిందని తెలిపారు. కేపిహెచ్ పి కి చెందిన వెంకటేశ్వర్ రావు సమాచారంతో ఈ ముఠా వెలుగు లోకి వచ్చిందని స్పష్టం చేసారు.

read also: Venkaiah Naidu: నేడు నగరంలో ఉపరాష్ట్రపతి పర్యటన.. ట్రాఫిక్‌ ఆంక్షలు

ఈముఠా సింగిల్ సిటింగ్ లో 10, ఇంటర్, డిగ్రీ ఫేక్ సర్టిఫికెట్స్ అందిస్తున్నారని, డిగ్రీ ఫేక్ సర్టిఫికెట్స్ 50 వేలకు, బీటెక్ సర్టిఫికేట్స్ లక్ష 50 వేల నుంచి 2లక్షల 50 లక్షల వరకు విక్రయిస్తుందని వెల్లడించారు. ఈ ముఠా ఉత్తరప్రదేశ్ తోపాటు 13 రాష్ట్ర యూనివర్సిటీల సర్టిఫికేట్స్ తయారు చేసిందని సీపీ తెలిపారు. ఈ ముఠా నుంచి 100 మందికి పైగా ఫేక్ సర్టిఫికెట్స్ పొందారని వెల్లడించారు. కొంత మంది ఈ ఫేక్ సర్టిఫికెట్స్ తో ఉద్యోగాలు పొందినట్లు తెలుస్తుందని, నిందితుల నుంచి 70 ఫేక్ సర్టిఫికేట్స్, 4 ఫేక్ స్టాంప్స్, CPU లు, బ్యాంక్ కార్డ్స్ , ఆధార్ కార్డ్స్, డ్రైవింగ్ లైసెన్స్ స్వాధీనం చేసుకున్నట్లు సీపీ స్టెఫెన్‌ రవీంద్ర వెల్లడించారు.

Arpita Mukherjee: పార్థ ఛటర్జీ మామూలోడు కాదు.. అర్పితా ఇంట్లో ఆ “టాయ్స్”