వినాయక చవిత వచ్చిందంటే గణేష్ ఉత్సవాలు అంబరాన్ని తాకుతాయి.. ముఖ్యంగా భాగ్యనగరంలో గణేష్ ఉత్సవాలకు, నిమజ్జనానికి ప్రత్యేకస్థానం ఉంది.. ఇక, ఖైరతాబాద్‌లో కొలువుదీరే మహా గణనాథుడి విగ్రహం తయారీ నుంచి నిమజ్జనం వరకు అంతా ప్రత్యేకమనే చెప్పాలి.. ఒక్కోఏడాది ఒక్కోరూపంలో దర్శనమిచ్చే ఖైరతాబాద్ వినాయకుడు ఈ ఏడాది పంచముఖ రుద్ర మహాగణపతిగా దర్శనమివ్వనున్నాడు. ఖైరతాబాద్ గణేష్ విగ్రహ నమూనాను ఇవాళే ఆవిష్కరించింది ఉత్సవ కమిటీ.. పంచముఖ రుద్ర మహాగణపతిగా భారీ గణనాథుడి దర్శనమివ్వనుండగా.. మండపంలో గణనాథుడికి ఎడమ వైపు కాలనాగదేవత, కుడివైపు కాలవిష్ణు విగ్రహాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ సారి 40 అడుగుల విగ్రహం ఏర్పాటుకు నిర్ణయం తీసుకోగా.. కుడి, ఎడమ వైపు ఏర్పాటు చేయనున్న విగ్రహాలను 15 అడుగుల్లో తయారు చేయనున్నారు. కాగా, ఖైరతాబాద్‌లో గణేష్ విగ్రహాన్ని 67 ఏళ్లుగా ఏర్పాటు చేసి పూజలు నిర్వహిస్తూ వస్తున్నారు.
పంచముఖ రుద్ర మహాగణపతిగా ఖైరతాబాద్ గణేష్

Khairatabad Ganesh