NTV Telugu Site icon

Hyderabad: ఒకే రోజు గణేష్ నిమజ్జనం, మిలాద్-ఉన్-నబీ.. టైమింగ్‌ మారుస్తారా..?

Melladunnabi Ganesh Nimajjanam

Melladunnabi Ganesh Nimajjanam

Hyderabad: ఈసారి గణేష్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ పండుగలు ఒకే రోజు రానున్నాయి. సెప్టెంబర్ 19న వినాయక నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానుండగా, 28న నిమజ్జనం నిర్వహించనున్నారు. అయితే అదే రోజు మిలాద్ ఉన్ నబీ పండుగ కూడా వచ్చింది. మిలాద్ ఉన్ నబీ సందర్భంగా హైదరాబాద్‌లో ముస్లింలు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అదే రోజు నిమజ్జనం జరగడంతో హిందువులు కూడా వినాయక శోభాయాత్రలు నిర్వహిస్తారు. అయితే రెండు మతాల పండుగలు ఒకే రోజున శాంతి భద్రతల సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఉత్సవాలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేసేందుకు చర్యలు చేపట్టారు. అందులో భాగంగానే ఇరు మతాలకు చెందిన 300 మంది నేతలతో శాంతి కమిటీ (పీస్ కమిటీ)ని ఏర్పాటు చేశారు. సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్ రావు నేతృత్వంలో పీస్ కమిటీ సమావేశం జరిగింది.

Read also: Google vs Teachers: గురువుల కన్నా గూగుల్ మిన్న..! ఏపీ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..

ఈ సమావేశంలో ఉత్సవాల నిర్వహణపై శాంతి కమిటీ సభ్యులు చర్చించారు. రెండు పండుగలు ఒకే రోజు కావడంతో మిలాద్ ఉన్ నబీ ర్యాలీని వాయిదా వేసేందుకు శాంతి కమిటీ సభ్యులు అంగీకరించారు. విగ్రహాలను ప్రతిష్టించిన 3వ, 6వ మరియు 9వ రోజులలో ఎప్పుడైనా గణేష్ విగ్రహాన్ని నిమజ్జనం చేయాలని హిందూ భక్తులు సూచించారు. రెండు పండుగలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. రెండు పండుగలు ఒకే రోజు రావడంపై ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. శాంతిభద్రతలు కాపాడాలని ప్రజలకు సూచించారు. ఒకే రోజు రెండు పండుగలు రావడంతో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా కొందరు ప్రయత్నిస్తున్నారని.. అలాంటి వారికి అవకాశం ఇవ్వకూడదన్నారు. హైదరాబాద్ శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకుని మిలాద్ ఉన్ నబీ ర్యాలీని రద్దు చేస్తూ ఎస్‌యూఎఫ్‌ఐ నిర్ణయం తీసుకుందని అసద్ వెల్లడించారు. ప్రజలు రెండు పండుగలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించారు.
Tamilnadu Accident: ఆగి ఉన్న లారీని ఢీ కొన్న వ్యాన్‌.. ఆరుగురు మృతి.. వైరల్ వీడియో