Ganesh idol collapsed: గణేష్ నిమజ్జనంలో అపశృతి.. ఒక్కసారిగా కూలిన విగ్రహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నగరం అస్తవ్యస్తంగా మారింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. కొన్ని చోట్ల గుంతలు ఏర్పడ్డాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలకు కూడా వాన ఆటంకంగా మారింది. కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్డులు దెబ్బతినడంతో.. గణేష్ నిమజ్జనానికి కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు భక్తులు. గణేష్ నిమజ్జనాలతో ట్యాంక్ బండ్ అంతా సోభాయమానంగా మారింది. నిమజ్జనానికి వచ్చే భక్తులతో ట్యాంక్ బండ్ కిక్కిరిసింది. గణేష్ నిమజ్జనానికి సంబంధించి ట్యాంక్ బండ్, పలు ప్రాంతాల్లో భారీ ఏర్పాట్లు చేశారు. ఈనేపథ్యంలో.. నగరవ్యాప్తంగా ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. రేపు శనివారం ఉదయం 10 గంటల వరకు ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. ఇక ట్యాంక్ బండ్ గణేశ్ నిమజ్జనానికి సంబంధించిన రూట్ మ్యాప్ లలో పకడ్భందీగా చర్యలు తీసుకుంటున్నారు. అయితే.. నిమజ్జనం కోసం వివిధ ప్రాంతాల నుంచి గణనాథుల విగ్రహాలు తరలివస్తున్నాయి. ఈనేపథ్యంలో.. ప్రధాన మార్గాల్లో హుస్సేన్‌సాగర్ వైపు భారీ సంఖ్యలో విగ్రహాలు బారులుతీరాయి.
ఇక హైదరాబాద్ గణేష్ నిమజ్జనోత్సవంలో అపశృతి చోటుచేసుకుంది. భారీ వర్షానికి తెల్లవారుజామున తడిసిన గణేష్ విగ్రహం ఒకసారి కుప్పకూలిన ఘటన హిమాయత్ నగరలో జరిగినది. కర్మాంఘాట్ చెందిన నవజీవన్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 20 అడుగుల భారీ మట్టి వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇవాళ నిమజ్జనానికి తరలిస్తుండగా, హిమాయత్ నగర్ బజాజ్ ఎలక్ట్రానిక్స్ వద్ద విగ్రహం కూలిపోయింది. దీంతో ఈ ప్రాంతంలో ట్రాఫిక్ నిలిచిపోయింది. ఘటన స్థలానికి చేరుకున్న నారాయణగూడ పోలీసులు క్రేన్ సహాయంతో విగ్రహాన్ని నిమజ్జనానికి తరలించినారు.
Bigg boss 6: కెప్టెన్సీ రేసులో ఆ ముగ్గురూ!
Also Read
- World Cotton Day: నేల నుంచి నేత వరకు.. తెల్ల బంగారం తెలంగాణ గుండెచప్పుడు..!
- Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
- TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
- Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
తాజావార్తలు
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Attahaasam : వెంకటేష్ మహా కమర్షియల్ సినిమా అట్టహాసం.. హిట్టు కొడతాడో లేదో
-
Mandhana-Harmanpreet: హర్మన్‌ప్రీత్, మంధాన మధ్య విభేదాలు.. రెండుగా విడిపోయిన భారత డ్రెస్సింగ్ రూమ్?
-
Chandrababu Delhi Tour: ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ప్రధాని మోడీతో సహా పలువురు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు
-
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
ట్రెండింగ్
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!