NTV Telugu Site icon

Mallu Ravi: గద్దర్ మరణం తెలంగాణ ప్రజానీకానికి తీరని లోటు

Mallu Ravi

Mallu Ravi

Mallu Ravi: గద్దర్ మరణం తెలంగాణ ప్రజానీకానికి తీరని లోటు అని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. సమాజంలో మార్పు కోసం అన్ని వర్గాల కోసం గద్దర్ పాటలు రాసారని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆట, పాట, మాట ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపింది గద్దర్ అని అన్నారు. గద్దర్ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారని గుర్తు చేశారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో కూడా గద్దర్ క్రియాశీలకంగా పాల్గొన్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీతోనే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని భావించిన గద్దర్, కాంగ్రెస్ నేతల సభలకు సంఘీభావం ప్రకటించారని అన్నారు. కార్ల్ మర్క్స్ ఎలాగైతే సమాజం కోసం పని చేసి మార్గదర్శకం అయ్యారో.. గద్దర్ ఆలోచన విధానం సామాజిక న్యాయం కోసం కృషి చేసారని తెలిపారు. గద్దర్ మరణం పట్ల సంతాపాన్ని ప్రకటిస్తూ వారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ తరపున సానుభూతి తెలియజేస్తున్నామని మల్లు రవి అన్నారు.

Read also: Daya 2: ఆ అననుమానాలు తీర్చేసేది అప్పుడే.. దయా 2 రిలీజ్ అయ్యేది ఎప్పుడంటే?

ప్రజా యుద్ధనౌక, ప్రజా గాయకుడు గద్దర్ మరణవార్త విని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని తెలుగు ప్రజలతో పాటు దేశంలోని ప్రముఖులు షాక్ అవుతున్నారు. ఊపిరితిత్తులు, మూత్ర సంబంధిత సమస్యలు, వయోభారం కారణంగా అమీర్‌పేటలోని అపోలో స్పెక్ట్రా ఆసుపత్రిలో 6వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు గుమ్మడి విఠల్ రావు అలియాస్ గద్దర్ కన్నుమూశారని అపోలో వైద్యులు అధికారికంగా ప్రకటించారు. ఆయన తీవ్రమైన గుండె జబ్బుతో బాధపడుతూ జులై 20, 2023న ఆస్పత్రిలో చేరారని.. ఆగస్టు 3, 2023న బైపాస్ సర్జరీ చేయించుకున్నారని వైద్యులు వెల్లడించారు. దాని నుండి కోలుకున్నారు. శస్త్రచికిత్స అనంతంరం ఆయన కోలుకున్నారని.. అయినప్పటికీ గతంలో ఊపిరితిత్తులు, మూత్ర సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని, దీంతో పాటు వయోభారం ఆయన ప్రాణాపాయానికి దారి తీసిందని వైద్యులు ప్రకటించారు.
Eesha Rebba Pics: గ్లామర్ డోస్ పెంచిన ఈషా రెబ్బ.. లేటెస్ట్ స్టిల్స్ వైరల్!