Gachibowli Building Collapse : గచ్చిబౌలిలో హైటెన్షన్.. కుప్పకూలిన 7 అంతస్తుల భవనం..!
- 50 గజాల్లో ఏడంతస్తుల నిర్మాణం
- పక్క అపార్ట్‌మెంట్‌పై కుప్పకూలిన భవనం
- భయంతో పరుగులు తీసిన స్థానికులు
- శిథిలాల కింద ఎవరైనా ఉన్నారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ ఐటీ కారిడార్ పరిధిలోని గచ్చిబౌలి అంజయ్య నగర్లో శనివారం మధ్యాహ్నం భారీ ప్రమాదం చోటుచేసుకుంది. కేవలం 50 గజాల స్వల్ప స్థలంలో అక్రమంగా నిర్మిస్తున్న ఒక ఏడంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. నిర్మాణంలో ఉన్న ఈ భవనం పక్కనే ఉన్న మరో అపార్ట్‌మెంట్‌పై పడటంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
బిల్డర్ అత్యాశే కారణం.. పక్క భవనాలు పాక్షికంగా ధ్వంసం
మాదాపూర్ సర్కిల్ పరిధిలోని అంజయ్య నగర్లో నిబంధనలకు విరుద్ధంగా, అతి తక్కువ స్థలంలో యజమాని, బిల్డర్లు కలిసి ఏడు అంతస్తుల భవనాన్ని నిర్మించారు. శనివారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఈ భవనం ఒక్కసారిగా పక్కకు వాలిపోయి, సమీపంలోని వైట్ ఫీల్డ్ అపార్ట్‌మెంట్‌పై కుప్పకూలింది. ఈ ధాటికి ఆ అపార్ట్మెంట్ సైతం పాక్షికంగా దెబ్బతింది. ప్రమాద తీవ్రతకు పక్కనే ఉన్న హాస్టల్లోని విద్యార్థులు, నివాసితులు భయంతో వీధుల్లోకి పరుగులు తీశారు.
Also Read
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్.. శిథిలాల కింద ఎవరైనా ఉన్నారా?
కూలిన భవనంలో ప్రమాద సమయంలో పనిచేసే కార్మికులు గానీ, ఇతరులు గానీ ఉన్నారా లేదా అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఘటన జరిగిన వెంటనే స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, జీహెచ్ఎంసీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. శిథిలాల కింద ఎవరైనా చిక్కుకున్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తూ, ఆ ప్రాంతంలో సహాయక చర్యలను వేగవంతం చేశారు.
తాజావార్తలు
-
Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
-
Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
-
WhatsApp: వాట్సాప్ లో కొత్త సెక్యూరిటీ ఫీచర్.. AI కూడా మీ చాట్ చదవలేదట! Restricted Chat ఎలా పనిచేస్తుందంటే?
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!