Nalgonda love Story: ప్రేమదేశం సినిమా రిపీట్.. విషాదంగా క్లైమాక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nalgonda love Story: నగరంలోని శివారు అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు మంచి స్నేహితులు. కానీ ఇద్దరూ ఒకే అమ్మాయి ప్రేమించడంతో తాను ప్రేమించిన అమ్మాయి తన స్నేహితుడికి దక్కుతుందేమో అని అనుమానంతో సొంత స్నేహితుడినే కొట్టి చంపేశాడు ఓ కిరాతకుడు. అచ్చం ప్రేమదేశం సినిమాను తలపించేలా ఈఘటన జరిగింది. కానీ క్లైమాక్స్ మాత్రం చాలా దారుణంగా ముగిసింది. ఈఘటన నల్గొండ జిల్లాలో సంచలనంగా మారింది.
Read also: Khammam market: ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఉద్రిక్తత.. మిర్చి అమ్మకానికి అడ్డుకోవడంతో దాడి
Also Read
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
నాగర్ కర్నూలు జిల్లా చారుకొండ మండలం సిరిసనగండ్లకు నెనావత్ నవీన్ అనే యువకుడు చెందినవాడు. నెనావత్ నల్గొండలోని ఎంజి యూనివర్సిటీ పరిధిలోని ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ త్రిబుల్ ఈ ఫోర్త్ ఇయర్స్ చదువుతున్నాడు. అయితే.. అదే కాలేజీలో చదువుతున్న హరికృష్ణతో ఇతనికి మంచి స్నేహం ఉంది. వీరిద్దరూ మంచి స్నేహితులే కానీ.. వీరిద్దరి మధ్యలో ఒక అమ్మాయి. ఆ అమ్మాయినే ఇద్దరూ ప్రేమించారు. అమ్మాయి ప్రేమ కారణంగా వీరిద్దరి స్నేహం దెబ్బతినడమే కాకుండా.. ఇద్దరి మధ్య తీవ్ర భేదాభిప్రాయాలు వచ్చాయి. అయితే ప్రేమించిన అమ్మాయి ఎక్కడ దక్కదనే భయం హరికృష్ణలో మొదలైంది. దీంతో ప్రాణానికి ప్రాణంగా ఉన్న నవీన్‌ను చంపేదుకు ప్లాన్ వేశాడు. అతని స్నేహితులతో హరికృష్ణ టచ్ లో వున్నాడు. ఈనేపథ్యంలోనే ఈ నెల 17వ తేదీన ఉదయం పార్టీ గెట్ టుగెదర్ చేసుకుందామని హరికృష్ణ.. తన స్నేహితుడి రూమ్ కి నెనావత్ నవీన్ ను రావాలని ఆహ్వానించాడు.
Read also: Nellore Church Blood: నెల్లూరు కబాడీపాలెంలో వింత.. శిలువ నుంచి రక్తం
అయితే.. స్నేహితుడి రూమ్ హైదరాబాద్ అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంది. తన ప్రాణ స్నేహితుడే కదా అని నవీన్, హరికృష్ణను నమ్మాడు. పాపం నవీన్ ఆరోజే తన చివరి రోజు అవుతుందని ఊహించలేక పోయాడు. కోరిక మేరకు నవీన్ అక్కడికి చేరుకున్నాడు. అయితే.. అక్కడ పార్టీలో మరోసారి నవీన్, హరి ఇద్దరికీ గొడవ జరిగింది. ఈ విషయాన్ని నవీన్ వెంటనే తన తండ్రి శంకరయ్యకు ఫోన్ చేసి తెలిపాడు. దీంతో భయాందోళన చెందిన హరి అది ఎక్కడికి దారితీస్తుందో అని భయపడిన శంకరయ్య.. హరితో ఫోన్లో మాట్లాడి రాజీ కుదిరించడంతో.. ఇద్దరి మధ్య గొడవ సద్దుమణిగింది. అయితే అప్పటి నుంచి నాలుగు రోజులైనా కూడా నవీన్ కాలేజీకి కానీ, ఇంటికి కానీ రాలేదు. కాగా.. కంగారుపడ్డ నవీన్ తండ్రి శంకరయ్య నార్కట్పల్లి పోలీస్ స్టేషన్లో ఈ మేరకు ఫిర్యాదు చేశాడు. అయితే.. శంకరయ్య ఫిర్యాదు మేరకు సీఐ శివరామిరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక నార్కట్పల్లి ఎస్సై రామకృష్ణ కేసును దర్యాప్తులో భాగంగా హరి స్నేహితులను, ఎంజీయూలోని విద్యార్థులను ప్రశ్నించగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.
Read also: Harish Rao: ప్రీతి కుటుంబ సభ్యులకు హరీశ్ పరామర్శ.. దోషులను శిక్షిస్తామని హామీ
ఈనెల 22 సాయంత్రం నుంచి హరి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చిందని, హరిక్రిష్ణ తల్లిదండ్రులను పోలీసులు పిలిపించి అతని గురించి అడిగారు. అయితే.. అప్పటివరకు అండర్ గ్రౌండ్ లో ఉన్న హరి స్నేహితులు, కుటుంబసభ్యులు, పోలీసుల నుంచి తన మీద ఒత్తిడి పెరుగుతుందని గ్రహించి అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్లో నిన్న శుక్రవారం హరి కృష్ణ లొంగిపోయాడు. మృతుడు నవీన్ తాను ప్రేమించిన అమ్మాయిని ఎక్కడ దక్కించుకుంటాడోనని, తనకు ఆమె ఎక్కడ దూరం అవుతుందోనని, అసూయతోనే నవీన్‌ని విచక్షణారహితంగా కొట్టి హత్య చేశానని హరికృష్ణ తెలిపాడు. అనంతరం నవీన్ మృతదేహాన్ని అబ్దుల్లాపూర్మెట్ శివారులోని హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారి మీద పడేసిన హరికృష్ణ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. హరికృష్ణ ఇచ్చిన సమాచారంతో వెంటనే మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు హరికృష్ణ మీద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.
Kondagattu Chori: కొండగట్టు చోరీ కేసు.. దొంగలు ఆలయంలో ఎలా వెళ్లారంటే..
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!