Site icon NTV Telugu

Free Ration: రేష‌న్‌కార్డుదారులకు శుభవార్త.. మరోసారి 10 కిలో ఉచిత బియ్యం పంపిణీ

Ration

Ration

మీకు రేషన్‌ కార్డు ఉందా? అయితే మీకు శుభవార్త… ఇవాళ్టి నుంచి ఒక్కొక్కరికి 10 కిలోల బియ్యం చొప్పున పంపిణీ చేస్తున్నారు.. తెలంగాణలో ఇవాళ నుంచి ఉచిత బియ్యం పంపిణీ ప్రారంభించారు… డిసెంబర్ వరకూ 10 కిలోల చొప్పున ఉచితంగా బియ్యాన్ని అందించనుంది ప్రభుత్వం.. రేషన్ కార్డుదారులకు ఊరటనిచ్చే వార్త చెప్పింది తెలంగాణ ప్రభుత్వం.. కేంద్రం ఇచ్చే బియ్యానికి అద‌నంగా మ‌రో ఐదు కిలోలు క‌లిపి మొత్తం ఒక్కొక్క‌రికి 10 కిలోల చొప్పున ఉచిత బియ్యం ఇస్తామ‌ని ఇప్పటికే ప్రకటించారు.. అందును అనుగుణంగా.. ఇవాళ్టి నుంచి రేషన్‌ బియ్యం పంపిణీ ప్రారంభమైంది..

Read Also: Munugode bypoll: అది జరిగితేనే బీఆర్‌ఎస్‌.. లేకపోతే టీఆర్ఎస్సే..!

కాగా, కేంద్ర ప్ర‌భుత్వం ఒక్కొక్కరికి డిసెంబర్‌ వరకు 5 కిలోల చొప్పున ఉచిత బియ్యం ఇస్తామని ప్రకటించింది.. అయితే, కేంద్రం వాటాకు మరో 5 కిలోలు కలిపి ఈనెల నుంచి డిసెంబర్‌ వరకు మనిషికి 10 కిలోల బియ్యం పంపిణీ చేస్తోంది తెలంగాణ సర్కార్.. దీంతో రాష్ట్రంలో దాదాపు 87 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది.. అదనపు బియ్యం పంపిణీతో రాష్ట్ర ప్రభుత్వంపై 227.25 కోట్ల అదనపు భారం పడుతోంది.. రాష్ట్రంలోని దాదాపు 90 లక్షల కార్డులపై 2.84 కోట్ల మంది ప్రయోజనం పొందనున్నారు.. మొత్తంగా ఇవాళ రాష్ట్రంలో మరోవిడత మనిషికి 10కిలోల ఉచిత బియ్యం పంపిణీ ప్రారంభమైంది.. 1.91 కోట్ల యూనిట్లకు మాత్రమే కేవలం 5 కిలోల చొప్పున ఉచిత రేషన్ ఇవ్వనున్నారు.. మిగతా 35.64 లక్షల కార్డులు, 91.72 లక్షల మందికి రాష్ట్రమే పూర్తి వ్యయంతో ఉచితంగా రేషన్ పంపిణీ చేస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

Exit mobile version