NTV Telugu Site icon

RTC MD Sajjanar: మేడారం జాతరకు ఫ్రీ జర్నీ.. గుడ్ న్యూస్ చెప్పిన సజ్జనార్‌

Medaram Jatara

Medaram Jatara

RTC MD Sajjanar: ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలంగాణ మహిళలకు గుడ్ న్యూస్ చెప్పారు. మేడారం జాతరకు మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తామని వెల్లడించారు. ఈ నెల 21 నుంచి 24 వరకు జరగనున్న మేడారం జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. దీంతో ప్రయాణికుల కోసం టీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. అదే సమయంలో మేడారం జాతరకు ఆర్టీసీ బస్సుల్లో కూడా మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తామని ఎండీ సజ్జనార్ తెలిపారు. కాగా, మేడారం జాతరకు టిఎస్‌ఆర్‌టిసి 6000 ప్రత్యేక బస్సులను నడుపుతుందని సజ్జనార్ తెలిపారు. మేడారం జాతరలో 51 బేస్ పాయింట్లు ఏర్పాటు చేశాం. ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్. ఖమ్మం జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఇందుకోసం ఈ జిల్లాల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నామన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా హనుమకొండ జిల్లా కాజీపేట నుంచి కూడా బస్సులు నడుపుతున్నట్లు వెల్లడించారు. అలాగే మేడారం జాతరకు ఆర్టీసీ బస్సుల్లో మహాలక్ష్మి పథకం అమలులో ఉంటుందని తెలిపారు. ఈ నెల 18 నుంచి 25 వరకు ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించామని అన్నారు.

Read also: Naa Saami Ranga OTT: కింగ్ నాగార్జున ‘నా సామిరంగ’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడు, ఎక్కడంటే?

ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయడం లేదని క్లారిటీ ఇచ్చారు. కాగా.. హైదరాబాద్‌ నుంచి మేడారం వరకు మొత్తం 228 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. ఉదయం 6.00, 6.30 గంటలకు జేబీఎస్‌ నుంచి.. బయలుదేరగా.. 7 గంటలకు ఎంజీబీఎస్‌ నుంచి బస్సులు కదలనున్నాయి. ఇందులో.. పెద్దలకు రూ.750 చిన్నారులకు రూ. 450 టిక్కెట్‌ ధర నిర్ణయించిన విషయం తెలిసిందే.. ఇక మేడారం నుంచి తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి, 2.30, 3.00 గంటలకు బయలుదేరతాయి. ఇక.. ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించారు. ఈ బస్సుల్లో రానుపోను టిక్కెట్‌ ఛార్జీ పెద్దలకు రూ.550, చిన్నారులకు రూ.310లు. ఇక.. సూపర్‌లగ్జరీ బస్సులు, ఏసీ బస్సులను కూడా నడుపుతారు కానీ.. వీటిల్లో ఉచిత ప్రయాణం లేదు. అయితే.. సూపర్‌ లగ్జరీలో టిక్కెట్‌ ధర పెద్దలకు రూ.750, చిన్నారులకు రూ.550, ఏసీ బస్సుల్లో పెద్దలకు రూ.950, పిల్లలకు రూ.750గా నిర్ణయించారు.
Bandi Sanjay: కదిలిన బండి పాదయాత్ర.. మహాశక్తి ఆలయంలో ప్రత్యేక పూజలు..