Naa Saami Ranga OTT: కింగ్ నాగార్జున ‘నా సామిరంగ’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడు, ఎక్కడంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nagarjuna’s Naa Saami Ranga Movie Locks OTT Release Date: ‘కింగ్’ నాగార్జున హీరోగా, విజయ్ బిన్నీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నా సామిరంగ’. సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్‍గా నిలిచింది. గుంటూరు కారం, సైంధవ్ నుంచి గట్టి పోటీ ఎదురైనా.. అంచనాలకు తగ్గట్టుగా కలెక్షన్లను రాబట్టింది. విలేజ్ బ్యాక్‍డ్రాప్‍లో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ నాగార్జునకు మంచి హిట్ ఇచ్చింది. నా సామిరంగ సినిమా ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా? అని వెయిట్ చేస్తున్న అభిమానులకు శుభవార్త.
నా సామిరంగ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ‘డిస్నీ ప్లస్ హాట్‍స్టార్’ ఓటీటీ ప్లాట్‍ఫామ్ సొంతం చేసుకుంది. ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్‍స్టార్‌లో ఫిబ్రవరి 17 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. మరో వారం రోజుల్లో థియేటర్లో చూడని వారు ఎంచక్కా ఇంట్లోనే ఎంజాయ్ చేయొచ్చు. ‘మీ స్క్రీన్‍లపై ఫైర్ అయ్యేందుకు కింగ్ వస్తున్నాడు. డేట్‍ను ఊహించగలరా’ అంటూ ఫిబ్రవరి 8న డిస్నీ ప్లస్ హాట్‍స్టార్ ఓ ట్వీట్ చేసింది. దాంతో అందరూ ఫిబ్రవరి 15 నుంచి నా సామిరంగ స్ట్రీమింగ్ అవుతుందని అందరూ ఊహించారు. అయితే అందరి అంచులను తలక్రిందులు చేస్తూ.. ఫిబ్రవరి 17న కింగ్ ఓటీటీలోకి వస్తున్నాడు.
Also Read
Also Read: Eagle Collections: రవితేజ కెరీర్‌లోనే రికార్డు కలెక్షన్స్.. యుద్ధకాండపై పెరిగిపోతున్న అంచనాలు!
నా సామిరంగ సినిమాను పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ చిత్రంలో నాగార్జున సరసన యంగ్ అండ్ బ్యూటిఫుల్ ఆశికా రంగనాథ్ కథానాయికగా నటించగా.. అల్లరి నరేష్, రాజ్ తరుణ్, మిర్నా మీనన్, రుక్సార్ ధిల్లాన్ కీలక పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాకు ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ ఎంఎం కీరవాణి ఇచ్చిన మ్యూజిక్ ఆకర్షణగా నిలిచింది.
తాజావార్తలు
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్‌గా ఇలా చేయండి!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!