Site icon NTV Telugu

Cyber Fraud: అమాయకులపై సైబర్‌ పంజా.. ట్రేడింగ్‌ పేరుతో 16 లక్షలు టోకరా..

Treding Froud

Treding Froud

Cyber Fraud: అధిక లాభాలు ఆశ చూపి నకిలీ ఆన్లైన్ ట్రేడింగ్ తో హైదరాబాద్ అమీన్ పూర్ కు చెందిన ఓ వ్యక్తి నుంచి సైబర్ నేరగాళ్లు రూ.33 లక్షలు కొట్టేసిన ఘటన మరువకముందే.. మరోఘటన చోటుచేసుకుంది. ట్రేడింగ్‌ పేరుతో 16 లక్షల సైబర్ మోసం జరగటంతో బాధితులు లబోదిబో మంటున్నారు. పెట్టుబడులు పెడితే లాభాలు వస్తాయమని ఆశించి మోసపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మోసపోయిన బాధితులు చివరకు పోలీసు మెట్లుఎక్కిల్సి వచ్చింది. మోసపోయిన డబ్బును తిరిగి ఇప్పించాలని ఫిర్యాదు చేశారు.

Read also: Israel- Hamas War: ఇజ్రాయెల్ ప్రధాని రాజీనామా చేయాలని డిమాండ్..!

హైదరాబాద్‌ లో అమాయకులకు సైబర్‌ నేరగాళ్లు టార్గెట్‌ చేసి మోశానికి పాల్పడుతున్నారు. స్టాక్‌ మార్కెట్‌లో ట్రేడింగ్‌ పేరుతో 16 లక్షల సైబర్ మోసం చేశారు. స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడుల ద్వారా అధిక లాభాలు వస్తాయని నమ్మించి ఓ వ్యక్తిని భారీ మోసం చేశారు. ఫేస్‌ బుక్ లో యాడ్ చూసి, అందులో ఉన్న బాధితుడు లింక్ ఓపెన్ చేశాడు. ఆ లింక్ లో సైబర్ చీటర్స్ సృష్టించిన నకిలీ ట్రేడింగ్ యాప్ లో విడతల వారిగా బాధితుడు రూ.16 లక్షలు పెట్టుబడులు పెట్టాడు. అయితే.. ఆ డబ్బు విత్ డ్రా కాకపోవడంతో మోసపోయానని భావించాడు. దీంతో బాధితులు సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు పిర్యాదు చేశాడు. సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి వాటికి అడిక్ట్‌ కావద్దని, ఇప్పటికైనా మోసపోవద్దని సూచిస్తున్నారు. అనవసరమైన లింక్‌ లు క్లిక్‌ చేయవద్దని తెలిపారు.
Atrocious: నిజామాబాద్‌ లో దారుణం.. బాలికను గర్భవతి చేసిన యువకుడు

Exit mobile version