Yadadri Bhuvanagiri: చిన్నారి ఊపిరి తీసిన రూ.5ల కాయిన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓ చిన్నారి ఆడుకుంటోంది. అక్కడ ఐదురుపాయల కాయిన్ కనిపించింది. అయితే ఆ చిన్నారి దానిని స్త నోట్లో వేసుకుంది. దీంతో అస్వస్థతకు గురైంది. గమనించిన తల్లదండ్రులు పసిపాపను వైద్యులు దగ్గరకు తీసుకు వెళ్లారు. వైద్యులు ఆకాయిన్ ను బయటకు తీసిన ప్రయోజనం లేకపోయింది. చివరకు ఆ చిన్నారి ప్రాణాలు వదిలింది. ఈ విషాద ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలోచోటుచేసుకుంది. కాగా.. భూదాన్ పోచంపల్లి పట్టణంలోని వెంకటరమణ కాలనీకి చెందిన బొంగు మహేశ్, సరిత దంపతులకు ఇద్దరు కుమార్తెలు.. చిన్న కుమార్తె చైత్ర(4) వారం రోజుల క్రితం ఇంటివద్ద ఆడుకొంటూ ఐదు రూపాయల కాయిన్ మింగేసింది.
read also: Varla Ramaiah : పాలకులు తమ చిత్త శుద్ది నిరూపించుకోవాలి
Also Read
అయితే.. ఆ కాయిన్ గొంతులో ఇరుక్కుపోవడంతో తల్లిదండ్రులు హుటాహుటిన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు చికిత్స చేసి చిన్నారి గొంతులోని కాయిన్ తీయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ.. చిన్నారి సోమవారం అస్వస్థతకు గురై శ్వాస తీసుకోవడానికి తీవ్రంగా ఇబ్బంది పడింది. ఈ నేపథ్యంలో.. తల్లిదండ్రులు చైత్రను అదే ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయింది. అయితే.. కాయిన్ ఇరుక్కోవడం వల్ల గొంతులో ఇన్‌ఫెక్షన్ సోకి చిన్నారి మరణించి ఉండొచ్చని స్థానికులు ఆరోపిస్తున్నారు. చిన్నారి చైత్ర ముద్దుముద్ద మాటలతో అల్లరి చేస్తూ ఆడుకుంటూనే అర్ధాంతరంగా తనువు చాలించడంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది.
TTD : తిరుమల హిస్టరీలోనే ఫస్ట్ టైమ్…ఒక్కరోజే రూ.6 కోట్లకు పైగా హుండీ ఆదాయం l
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్‌పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్‌లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్‌ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!