Site icon NTV Telugu

Tragedy: విషాదం.. మట్టి మిద్దె కూలి నలుగురు మృతి

Tragedy

Tragedy

Tragedy: నాగర్ కర్నూల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మట్టి మిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందిన విషాద ఘటన నాగర్ కర్నూల్ మండలం వనపట్లలో జరిగింది. ఆదివారం భారీ వర్షం కురవడంతో మట్టి మిద్దె కూలి తల్లి గొడుగు పద్మ (26) ఇద్దరు కూతుర్లు పప్పి(6) , వసంత (6) , ఒక కుమారుడు విక్కి మృతి చెందారు. తండ్రికి గాయాలు కాగా.. జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఒకే కుటుంబంలో నలుగురు మృత్యువాత పడడంతో ఆ గ్రామాన్ని విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని వివరాలు సేకరించారు.

Read Also: Cricket Betting : హైదరాబాద్‌లో క్రికెట్ బెట్టింగ్ రాకెట్ గుట్టు రట్టు

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో వనపట్లకు చెందిన గొడుగు భాస్కర్‌కు చెందిన ఇల్లు ఆదివారం రాత్రి కుప్పకూలింది. దీంతో ఇంట్లో నిద్రిస్తున్న పద్మ(26) తోపాటు ఆమె ఇద్దరు కుమార్తెలు పప్పి (6), వసంత (9), కుమారుడు విక్కీ అక్కడికక్కడే మరణించారు. తండ్రి భాస్కర్‌ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు భాస్కర్‌ను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మట్టిపెళ్లలు తొలగించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఇళ్లు కూలిన ప్రదేశాన్ని ఆర్డీవో, ఎమ్మార్వో పరిశీలించారు. వానాకాలం కావడంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పాత ఇండ్లు ఉన్నవారు తాత్కాలికంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.

Exit mobile version