Wedding Shoot: ఫ్రీ వెడ్డింగ్‌ షూట్‌కు వెళుతుండగా విషాదం.. కారులో వున్న ఐదుగురు మృతి

Wedding Shoot

Wedding Shoot

Wedding Shoot: భద్రాద్రి కొత్తగూండె జిల్లా కోటిలింగాల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఇల్లెందు మహబూబాబాద్‌ మధ్య కోటిలింగాల సమీపంలో కారు-లారీ ఢీకొన్నాయి. బలంగా ఢీకొట్టడంతో..కారు ముందుభాగం నుజ్జు నుజ్జు అయ్యింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్నవారు మృతి చెందినట్లు సమాచారం. కారు డ్రైవర్‌ సహా ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారని, మరొకరు దవాఖానకు తీసుకెళ్తండగా చనిపోయారు. అయితే స్థానిక సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు.

Read also: Fire Accident Medak: మెదక్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం.. ఆహుతైన షాపులు

మృతులను హనుమకొండ జిల్లా కమలాపూర్‌కు చెందిన అరవింద్‌, వరంగల్‌కు చెందిన రాము, కల్యాణ్‌, శివగా, గాయపడిన వ్యక్తిని నర్సంపేటకు చెందిన రణధీర్‌గా గుర్తించారు. వీరంతా ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ కోసం భద్రాద్రి జిల్లా మోతె ప్రాంతానికి వెళ్తున్నట్లు తెలుస్తుందని తెలిపారు. కారులో వెడ్డింగ్‌ సూట్‌కి సంబంధించిన వస్తులు ఉన్నాయని తెలిపారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. అయితే.. ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం వీరంతా మోతేకి వెడుతున్నట్లు తెలుస్తోంది. కారు టీఎస్03ఎఫ్ సీ 9075 నంబరు గల మహబూబాబాద్ వైపు నుంచి ఇల్లందు వెడుతోంది. కాగా.. ఈ కారును ఏపీ16టీజీ 3859 అనే నంబరు గల ఇల్లెందు నుంచి మహబూబాబాద్ వైపు వెడుతున్న లారీ వేగంగా ఢీ కొట్టింది.. దీంతో కారులో ఉన్న ఐదుగురు మృతి చెందారు. ఇందులో ఒకరు చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే లారీలో వున్న వ్యక్తి పారారీలో వున్నాడా? లేక అదుపులోకి తీసుకున్నారా? అనే విషయంపై ఇంకా నిర్ధారణ రాలేదు. అయితే.. కారులో ప్రయాణించే వ్యక్తులందరూ చనిపోవడం లారీ స్పీడ్‌ గా నడపడంవల్లనే ఈ ప్రమాదం జరిగిందా? లారీ డ్రైవర్‌ తాగి బండినడిపాడా? అనే కోణంలో విచారణ చేపట్టారు పోలీసులు.
Giant Pendulum : జీవితంలో మరోసారి జాయింట్ వీల్ పదం అంటే హడలిపోతారేమో !