NTV Telugu Site icon

Thummala Joins Congress: నేడే కాంగ్రెస్‌ లోకి తుమ్మల.. 40 ఏళ్ల రాజకీయ ప్రస్తానంలో కీలక మలుపు

Tummala Nagewsher Rao

Tummala Nagewsher Rao

Thummala Joins Congress: మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాజకీయ ప్రస్థానంపై ఉత్కంఠ వీడింది. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధమైంది. హైదరాబాద్‌లో శనివారం నుంచి రెండు రోజుల పాటు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో పాటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా హాజరుకానున్నారు. ఈనేపథ్యంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సమక్షంలో తుమ్మల కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నారు.

బీఆర్‌ఎస్ నుంచి పాలేరు అసెంబ్లీ టికెట్ ఆశించి నిరాశపడ్డ ఆయన కాంగ్రెస్‌లో చేరుతున్నారు. తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్‌లో చేరడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయ ముఖచిత్రం మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 40 ఏళ్ల రాజకీయ జీవితం మరో మలుపు తిరుగుతోంది. నాలుగు దశాబ్దాలుగా ఖమ్మం జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసి, అభివృద్ధి మాంత్రికుడిగా పేరుగాంచిన తుమ్మల తదుపరి కాంగ్రెస్‌లోకి వెళ్లనున్నారు. వచ్చే ఎన్నికల్లో పాలేరు బీఆర్ఎస్ టికెట్ ఆశించి నిరశచెందారు. సిట్టింగ్ ఎమ్మెల్యేపై బీఆర్‌ఎస్ అధినేత మొగ్గుచూపడంతో తుమ్మల తీవ్ర నిరాశకు గురయ్యారు. అభ్యర్థుల జాబితాలో చోటు దక్కకపోవడంపై తుమ్మల బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read also: NTR: సైమా బెస్ట్ యాక్టర్ ఎన్టీఆర్… ఏడేళ్ల తర్వాత అవార్డ్

ఈ ఏడాది ఆగస్టు 21న కేసీఆర్ విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో తుమ్మల నాగేశ్వరరావుకు టిక్కెట్ దక్కలేదు. పాలేరు నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేయాలని తుమ్మల నాగేశ్వరరావు భావించారు. కానీ పాలేరు నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డికి బీఆర్ఎస్ టికెట్ దక్కింది. ఇలా తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన తన అనుచరులతో తుమ్మల నాగేశ్వరరావు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రజా క్షేత్రంలోనే ఉండాలని తుమ్మల నాగేశ్వరరావు తన అనుచరులకు సూచించారు. అయితే వచ్చే ఎన్నికల్లో పాలేరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తానని తుమ్మల నాగేశ్వరరావు తన అనుచరులకు హామీ ఇచ్చారు. ఈ మేరకు రంగం సిద్ధం చేస్తున్నారు.
Andhra Pradesh Crime: ఏపీలో ట్రిపుల్ మర్డర్.. దంపతులను నరికేశాడు.. రాళ్లదాడిలో చనిపోయాడు..