NTV Telugu Site icon

Jupally Krishna Rao : ఈ రోజుకు టీఆర్‌ఎస్‌లోనే ఉన్నా..! రేపు..!

Jupally Krishna Rao

Jupally Krishna Rao

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో అధికార టీఆర్ఎస్‌ పార్టీలో వర్గపోరు హాట్‌ టాపిక్‌గా మారిపోయింది.. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి మధ్య విబేధాలు తారాస్థాయికి చేరుకున్నాయి.. నియోజకవర్గం అభివృద్ధి, అవినీతి విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా.. బహిరంగ చర్చకు ఇద్దరు నేతల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లతో టెన్షన్‌ వాతావరణం నెలకొంది.. అయితే, ఇదే సమయంలో జూపల్లి కృష్ణారావు పార్టీ మారుతున్నారనే చర్చ కూడా సాగుతోంది.. కొల్లాపూర్‌ వెళ్తారా? చర్చలో పాల్గొంటారా? అనేది ఆసక్తికరంగా మారగా.. ఈ పరిణామాలపై మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు.. రేపు ఉదయం కొల్లాపూర్‌ వెళ్తున్నట్టు స్పష్టం చేశారు.. ఎస్పీ అనుమతి ఇవ్వని విషయం నాకు తెలియదన్న ఆయన.. మంత్రి కేటీఆర్ కు ఈ వ్యవహారంతో సంబంధం లేదన్నారు.

Read Also: Tarun Chug: కేసీఆర్‌కు బైబై చెప్పే టైం వచ్చింది..

ఇక, నా వ్యక్తిగత జీవితంపై కామెంట్స్ చేశారు.. నేను తుడిచేసుకుని పోయే వ్యక్తిని కాదు.. ఆత్మాభిమానం గల వాడిని అన్నారు జూపల్లి కృష్ణారావు… ప్రస్తుతం తాను టీఆర్ఎస్‌ పార్టీలోనే ఉన్నానని స్పష్టం చేసిన ఆయన.. తాను కాంగ్రెస్‌ లేదా బీజేపీలో చేరుతాననేది ఊహాగానాలు మాత్రమే అన్నారు. ఈ రోజుకు తాను టీఆర్ఎస్‌ పార్టీలోనే ఉన్నానని వ్యాఖ్యానించారు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు.. కాగా, జూపల్లి కృష్ణారావు ఇంటి ముందు చర్చకు సిద్ధమని సవాల్‌ చేశారు ఎమ్మెల్యే హర్షవర్ధన్‌ రెడ్డి.. దానిపై జిల్లా ఎస్పీకి దరఖాస్తు చేసుకోవడం చర్చకు దారితీసింది.. మరోవైపు, ఇద్దరు నేతలు చర్చకు సిద్ధం అవుతున్నారు.. సవాళ్లు, ప్రతిసవాళ్ల ప్రకారం రేపు అంటే ఈ నెల 26వ తేదీన చర్చ జరగాల్సి ఉంది.. దీంతో ఏం జరగబోతోంది? అనేది ఉత్కంఠగా మారింది. జూపల్లి కొల్లాపూర్‌ వెళ్లడానికి సిద్ధం అవుతుండగా.. మరి ఎమ్మెల్యే వస్తారా? పోలీసుల అనుమతి ఇస్తారా? ముందే ఇద్దరు నేతలను కట్టడి చేస్తారా? అనేది ఉత్కంఠగా మారింది.