Site icon NTV Telugu

Loddi Mallayya: ఈసారి లొద్ది మల్లన్న జాతర రద్దు.. కారణం ఇదే..

Loddi Mallayya

Loddi Mallayya

హైదరాబాద్‌ నుంచి శ్రీశైలం వెళ్లే రోడ్డులో నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం నల్లమల ఫారెస్టులోని లొద్దిలో వెలిసిన మల్లన్న జాతరకు ఈ సారి అనుమతులు రద్దు చేశారు ఫారెస్ట్‌ అధికారులు.. పుణ్య క్షేత్రాల్లో లొద్ది మల్లన్న ఆలయాన్ని పవిత్రంగా భావిస్తారు.. ప్రకృతి సౌందర్యం కలిగిన లొద్ది మల్లన్న గుడికి ఏటేటా భక్తుల సంఖ్య వేలల్లో పెరుగుతూ పోతోంది.. శివభక్తులతో పాటు ప్రకృతి ప్రేమికులు, సాహస యాత్రికులు ఇలా చాలా మంది ఆ క్షేత్రానికి వెళ్తుంటారు.. అయితే, ఏడాది పొడువునా ఇక్కడికి భక్తులకు అనుమతి ఇవ్వరు ఫారెస్ట్‌ అధికారులు.. అందమైన నల్లమల అడవుల్లో పర్వత గుహలో వెలసినా ఈ మల్లన్న స్వామి సంవత్సరమున కేవలం తొలి ఏకాదశి నాడు మాత్రమే దర్శనానికి అనుమతి ఉంటుంది.

Read Also: YSRCP Plenary 2022: ఏ బిడ్డా.. ఇది జగనన్న అడ్డా..!

దట్టమయిన అడవుల నడుమ లోయలలో, జలపాతాల మధ్య ఒక గుహలో అద్భుతమయిన ప్రకృతి మధ్య ఈ క్షేత్రం ఉంటుంది.. ఇక, లొద్ది మల్లయ్య క్షేత్రాన్ని సలేశ్వ్వరము యాత్ర అని తెలంగాణ “అమరనాథ్” యాత్రగా ప్రసిద్ధి చెందినది. అయితే, ఈ ఏడాది జాతరకు అనుమతులు రద్దుచేసినట్టు ఫారెస్ట్‌ అధికారులు ప్రకటించారు.. పెద్ద పులులు, అడవి జంతువుల సంచారం ఎక్కువగా ఉన్నందున, మరియు అకాల వర్షం కారణంగా భక్తులు లోయలో జారిపడే ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో తొలి ఏకాదశి లొద్ది మల్లయ్య జాతరకు అనుమతించడం లేదని, అమ్రాబాద్ ఫారెస్ట్ డివిజనల్ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. కాగా, నల్లమల ఫారెస్ట్‌లో ఒక వింత లోయ ఉన్నది. దాన్ని స్థానికులు లొద్ది, అని గుండం అని వ్యవహరిస్తారు. ఈప్రాంతంలో వెలిసిన మల్లన్న స్వామి పేరుమీద లొద్దిమల్లయ్య గుడి అని కూడా ఇక్కడి దేవాలయాన్ని పిలుస్తారు. ఈ గిరి సముద్ర మట్టానికి 914 మీటర్ల ఎత్తున ఉండటంతో వాతావరణం చల్లగా ఉంటుంది. ఇది, హైదరాబాద్‌కు 145 కిలోమీటర్లు, శ్రీశైలానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రతీ ఏడాది ఈ యాత్రకు భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది.. ఈ జాతరకు వెళ్లడం పెద్ద సాహసమే అయినా.. చాలా మంది మల్లన్న దర్శనానికి తరలివెళ్తుంటారు.. కానీ, ఈ ఏసారి ఆ అవకాశం లేకుండాపోయింది.

Exit mobile version