Flexi War in Khammam: ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని పాలేరులో రిజర్వాయర్లో చేపల పంపిణీ కార్యక్రమం రసా బస అయ్యింది. కార్యక్రమంలో ప్రోటోకాల్ పాటించడం లేదంటూ పాల్గొనకుండానే ఎంపీలు ఎమ్మెల్సీ వెనుతిరిగి వెళ్లిపోయారు. పాలేరు రిజర్వాయర్లో చేపల పిల్లలను వదిలే కార్యక్రమం కొద్దిసేపటి క్రితం నిర్వహించవలసి ఉంది. అయితే ఈ కార్యక్రమానికి పార్లమెంటు సభ్యులు నామా నాగేశ్వరరావు రాజ్య సభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ,ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ రావు వచ్చారు ముగ్గురు ప్రజా ప్రతినిధులు వచ్చినప్పటికీ స్థానిక ఎమ్మెల్యే కందుల ఉపేందర్ రెడ్డి రాకపోవడం తో పాటు ప్రోటోకాల్ పాటించడం లేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి ఎమ్మెల్యే పేర్లను మాత్రమే ఫ్లెక్సీలు ఏర్పాటు చేయటం తో ఆగ్రహం వ్యక్తం చేశారు.
సమయపాలన పాటించటం ప్రోటోకాల్ పాటించడం తెలియదా అంటూ అధికారులపై ఎంపీలు, ఎమ్మెల్సీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే.. మంత్రి పువ్వాడ, ఎమ్మెల్యే కందాల ఫ్లెక్సీలు పెట్టాలని ఎవరు చెప్పారంటూ జిల్లా పార్టీ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ తాతా మధు హెచ్చరించారు. అంతేకాకుండా.. ఒకరిద్దరికి అధికారులు ఊడిగం చేయొద్దని ఫైర్ అయ్యారు. కాగా.. మీరు చేస్తున్న పనులపై కమిషనర్ తో మాట్లాడుతానంటూ వార్నింగ్ ఇచ్చారు. ఈ..ఫ్లెక్సీలు పెట్టడంలో అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరించారని టీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Pawan Kalyan : పవన్ కల్యాణ్ బస్సు యాత్ర వాయిదా
