Telangana Rain: రానున్న ఐదు రోజుల పాటు తెలంగాణలో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం హైదరాబాద్ శాఖ ప్రకటించింది. కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. మేడ్చల్, నల్గొండ, రంగారెడ్డి, సూర్యాపేట, హైదరాబాద్, జనగాం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, భువనగిరి జిల్లాల్లో వర్షం కురుస్తుంది. ఈ మేరకు అధికారులు ఎల్లో, గ్రీన్ అలర్ట్ ప్రకటించారు. మంగళవారం రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురిశాయి. జనగాం, మహబూబాబాద్, వరంగల్, మేడ్చల్-మల్కాజ్‌గిరి, నల్గొండ, రంగారెడ్డి, సూర్యాపేట, హన్మకొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో వర్షం కురిసింది.
Read also: Supreme Court: అర్చకులు కావడానికి అన్ని కులాల వారూ అర్హులే: సుప్రీంకోర్టు
వరంగల్‌లో 49.3, మహబూబాబాద్‌లో 32.3, నల్గొండలో 30.8, హైదరాబాద్‌లో కూడా పలుచోట్ల వర్షం కురిసింది. నానక్రం గూడ, హైటెక్ సిటీ, పంజాగుట్ట, గచ్చిబౌలి, రాజేంద్రనగర్, మణికొండ, పాతబస్తీలోని కొన్ని ప్రాంతాలు, ట్యాంక్ బండ్, సెరిలింగంపల్లి, షేక్‌పేట్, అంబర్‌పేట్, నాంపల్లి, ఉప్పల్, ఆసిఫ్‌నాగ తదితర ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. వాతావరణ శాఖ కూడా ఏపీకి వర్ష హెచ్చరికలు జారీ చేసింది. ఈరోజు నెల్లూరు, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఏలూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు.
Astrology: ఆగస్టు 23, బుధవారం దినఫలాలు