రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. భారీ నమోదవుతున్న ఉష్ణోగ్రతలు ప్రమాదానికి దారితీస్తున్నాయి. ఇప్పటికే పలు వాహనాలు అగ్ని ప్రమాదానికి గురవగా.. తాజాగా నగరంలోని రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ గండి పేట వై జంక్షన్ వద్ద రన్నింగ్ కారు లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కారులో నుండి మంటలు రావడం గమనించిన యజమాని అప్రమత్తమై కారులో నుంచి కొందికి దిగి పరుగులు పెట్టాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది.
తన కళ్ల ముందే కారు క్షణాల్లో పూర్తిగా కాలి బూడిదైంది. దీంతో ప్రాణాలతో బయటపడ్డ కారు యజమాని ఊపిరి పీల్చుకున్నాడు. మెహిందీ పట్నం నుండి మొయినాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని యజమాని తెలిపారు. షాక్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగాయని అన్నాడు. కారు యజమాని శ్రీహరి ఓపత్రికా విలేకరిగా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. TS13UA4520 గల నిస్సాన్ మైక్రో కారుగా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపకశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేశారు. ప్రమాదానికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?