Hyderabad: హైదరాబాద్ లోని జీడిమెట్లలో జరిగిన అగ్ని ప్రమాద ఘటన మరువకముందే.. ఇవాళ నగరంలో మరో రెండు చోట్లు అగ్ని ప్రమాద ఘటనలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. ఇవాళ మణికొండ, రామంతపూర్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికంగా ఈ ఘటనలు కలకలం సృష్టించాయి. అగ్ని ప్రమాద ఘటనలతో ఫైర్ సిబ్బంది అలర్ట్ అయ్యారు. సమాచారం అందిన వెంటనే పరుగులు పెట్టి మంటలను అదుపు చేసేందుకు నానా కష్టాలు పడుతున్నారు. రెండు రోజుల నుంచి నగరంలో వరుసగా అగ్ని ప్రమాదాలు చోటుచేసుకోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
Read also: Pushpa 2: దేవిశ్రీకి షాక్.. ‘గంగమ్మ జాతర’ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే?
హైదరాబాద్ మణికిండలోని ఈఐపీఎల్ అపార్ట్‌మెంట్‌లో ఎనిమిదో అంతస్తులోని 804 ఫ్లాట్‌లో రెండు రోజుల క్రితమే సంతోష్ అనే వ్యక్తి గృహప్రవేశం చేశారు. గృహప్రవేశం అనంతరం దేవుడి గదిలో దీపం పెట్టి కుటుంబ సభ్యులు నిద్రపోయారు. ఇవాళ ఉదయం తెల్లవారు జామున దీపం ఎదురుగా ఉన్న కళశానికి ఒక్కసారిగా మంటలు అంటున్నాయి. వెంటనే తేరుకున్న సంతోష్ కుటుంబ సభ్యులు ఇంట్లో వున్న గ్యాస్‌ను ఆఫ్ చేసి అపార్ట్ మెంట్ నుంచి కిందికి పరుగులు పెట్టారు. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేసే పనిలోపడ్డారు. కాగా..మంటలు వ్యాపించి ఇంట్లో ఉన్న ఇంటీరియర్ డిజైనర్ పూర్తిగా కాలిపోయింది. గృహప్రవేశం చేసిన రెండు రోజులకే అగ్నిప్రమాదం జరగడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
Read also: WI vs BAN: భారీ తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన వెస్టిండీస్..
మరోవైపు నగరంలోని రామంతపూర్ లోని వివేక్ నగర్ లోని ఓ ఇంట్లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. తెల్లవారు జామున 3.30 సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. మంటల తాకిడికి పార్కింగ్ లో ఉన్న మరో ఎనిమిది బైకులు దగ్ధమయ్యాయి. పార్కింగ్ లో రెండు బ్యాటరీ బైక్ లు, ఏడు ఇతర బైకులు ఉన్నట్లు సమాచారం. వెంటనే స్థానికులు మంటలను అదుపుచేశారు. సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న ఉప్పల్ పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బ్యాటరీ బైక్ పేలి భారీగా మంటలు వ్యాపించినట్లు అనుమానం వ్యక్తం చేశారు పోలీసులు.
Telangana BJP: నేడు ప్రధానితో తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు సమావేశం..