Site icon NTV Telugu

Fire accident: రాజేంద్రనగర్ లో భారీ అగ్ని ప్రమాదం.. పక్కనే మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్..!

Fair Accident

Fair Accident

Fire accident: హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ శాస్త్రీపూరంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మీర్ అలం ఫిల్టర్ సమీపంలోని ప్లాస్టిక్ గోదాంలో పెద్ద ఎత్తున్న మంటలు ఎగిసిపడుతున్నాయి. ఒక్కసారిగా మంటలు చలరేగడంతో.. స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. పోలీసులకు, ఫైర్‌ సిబ్బందికి సమాచారం అందించారు. హుటా హుటిన చేరుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్లాస్టిక్ వస్తువులు ఉండటంతో గోదామ్‎లో ఉన్న రెండు డీసీఎం వాహనాలు దగ్ధం అయ్యాయి. దీంతో మంటలకు తోడు దట్టమైన పొగలు వ్యాపించింది. ఘాటైన పొగలు వ్యాపించడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రెండు అగ్నిమాపక సహాయంతో మంటలను అదుపులోకి తీసుకువస్తోన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్లే జరిగినట్లు సమాచారం. అగ్ని ప్రమాదం జరిగిన పక్కనే మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ ఉండటంతో అక్కడ పిల్లల్ని ఖాళీ చేయించిన అధికారులు. చిన్నారులు పక్కనే ఉన్న ఫంక్షన్ హాల్ లో ఆశ్రయం కల్పించారు. ప్రమాదంలో ఎవరైనా చిక్కుకున్నారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సివుంది.

Read also: Gold Rate Today: బంగారం కొంటున్నారా?.. కొత్త రేట్లు తెలుసుకోండి

ఫైర్ ఆక్సిడెంట్ పై టీచర్లు మాట్లాడుతూ.. అగ్ని ప్రమాదం ఉదయం జరిగిందని అన్నారు. అగ్ని ప్రమాదం జరిగిన పక్కనే మా మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ ఉందని, పెద్ద ఎత్తున పొగలు వ్యాపించాయని భయాందోళనకు గురయ్యామని పేర్కొన్నారు. ఫైర్ & పోలీస్ అధికారులు వెంటనే స్పందించారని, వెంటనే క్లాస్ రామ్ లో ఉన్న పిల్లల్ని ఖాళీ చేయించి పక్కనే ఉన్న ఫంక్షన్ హాల్ లోకి తీసుకువచ్చామన్నారు. పక్కనే ఉన్న ఫంక్షన్ హాల్ లో ఆశ్రయం కల్పించారన్నారు. మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్లో ఇంటర్మీడియట్ సెకండియర్ ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉందని, ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ఇబ్బందీ కలగలేదన్నారు. స్టూడెంట్స్ అందరూ సేఫ్ గా ఉన్నారని పేర్కొన్నారు. పొగలు కంట్రోల్ లోకి వస్తే పిల్లలు క్లాస్ రూం తీసుకువెళతామని, పరీక్షలు యదావిధిగా కొనసాగుతుందని టీచర్లు పేర్కొన్నారు.

Read also: Revanth Reddy: నేడు కామారెడ్డిలో రేవంత్ రెడ్డి పాదయాత్ర..

ఇక తాజాగా సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. గురువారం రాత్రి 7 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. తొలుత ఎనిమిదో అంతస్తులో మొదలైన మంటలు.. తర్వాత 7, 6, 5 అంతస్తులకు వ్యాపించాయని స్థానికులు తెలిపారు. ప్రమాదం జరగడంతో చాలా మంది బయటకు పరుగులు తీశారు. కొందరు మాత్రం బయటకు రాలేక చిక్కుకుపోయి పొగతో ఊపిరాడక ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతులు ప్రమీల, వెన్నెల, శ్రావణి, త్రివేణి, శివ, ప్రశాంత్‌గా గుర్తించారు. మృతుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. మృతుల్లో వరంగల్‌కు చెందిన ముగ్గురు, ఇద్దరు మహబూబాబాద్‌ వాసులు, ఖమ్మంకు చెందిన ఒకరు ఉన్నారు.
JP Nadda: కాంగ్రెస్‌కు ప్రమాదం ఉంది.. ప్రజాస్వామ్యానికి కాదు

Exit mobile version