NTV Telugu Site icon

Fire Accident: సికింద్రాబాద్ రైల్‌ నిలయం వద్ద అగ్నిప్రమాదం.. మంటలు చెలరేగడంతో..

Fire Accident

Fire Accident

Fire Accident: సికింద్రాబాద్ రైలు నిలయంలోని పాత క్వార్టర్స్‌లో మంటలు చెలరేగాయి. ఆ ప్రాంతంలోని చెత్తకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించడంతో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. దీంతో ఈ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం జరుగుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే ఈ ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Read also: Kakinada Oil Factory: ఫ్యాక్టరీలో ఘోరప్రమాదం.. ఊపిరాడక ఏడుగురు మృతి

ఇది ఇలా ఉండగా.. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామికవాడలోని లీ ఫార్మా లిమిటెడ్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రోజూ ఉదయం పరిశ్రమల పనులను కార్మికులు మొదలు పెట్టారు. పరిశ్రమలోని ప్రొడక్షన్ బ్లాక్ లో సాల్వెంట్ ను అన్ లోడ్ చేస్తుండగా ఒక్కసారిగా స్పార్క్ రావడంతో ఒకేసారి ట్యాంక్ పేలి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో ప్రొడక్షన్‌ బ్లాక్ లో ఉవ్వెత్తున మంటలు చెలరేగాయి. పరిశ్రమలో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. మంటలు, కమ్ముకున్న పొగలతో పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బయటకు పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ ఆసుపత్రికి ఆంబులెన్స్ లో తరలించారు. స్థానిక సమాచారంతో పరిశ్రమ వద్దకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నాలు చేపట్టారు. అయితే మంటలు ఎగిసిపడుతుండటంతో మంటను ఆర్పడానికి ఫైర్ సిబ్బంది గంటల తరబడి ప్రయత్నించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. దీంతో స్థానికుల ఊపిరి పీల్చుకున్నారు.
MLA Shankar Nayak: మానుకోట రాళ్ల రుచి రేవంత్ కు తెలియదు నేను సైగ చేస్తే..

Show comments