NTV Telugu Site icon

Fire Accident in Oil Mill: ఆయిల్ మిల్లులో అగ్ని ప్రమాదం.. భయంతో పరుగులు తీసిన స్థానికులు

Fire Accident

Fire Accident

Fire Accident in Oil Mill: కరీంనగర్ జిల్లా బైపాస్ రోడ్డు సమీపంలోని రజ్వీ చమాన్ వద్ద గన్నీ సంచుల గోడౌన్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకున్న ఘటన మరువకముందే.. జగిత్యాల జిల్లాలో ఆయిల్‌ మిల్లులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు చలరేగడంతో.. స్థానికులు భయంతో బయటకు పరుగులు పెట్టారు.

జగిత్యాల జిల్లా జగిత్యాల కొత్త బస్టాండ్‌ సమీపంలోని వెంకటేశ్వర్‌ అయిల్ మిల్లులో అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా భారీగా మంటలు ఎగిసిపడటంతో.. స్థానిక ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో.. ఘటనాస్థలికి చేరుకున్న రెండు అగ్ని ఫైర్ ఇంజన్ మంటలను సిబ్బంది అదుపులోకి తెచ్చారు. సుమారు రూ.15 లక్షల నష్టం వాటిల్లిందని మిల్లుర్లు తెలుపుతున్నారు. పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసారు. దర్యాప్తులో భాగంగా.. షార్టు సర్క్యూట్‌తో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోందన్నారు. మిల్లులో 7 గ్యాస్‌ సిలిండర్లు ఉండగా అందులో ఒకటి గ్యాస్‌ సిలిండర్‌ పేలినట్లు తెలిపారు. సహాయ చర్యల్లో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు.

Read also: Clashes in Macherla: మాచర్ల ఘటన ఎఫెక్ట్.. జిల్లా వ్యాప్తంగా టీడీపీ నేతల హౌస్ అరెస్ట్

నిన్న కరీంనగర్ జిల్లా బైపాస్ రోడ్డు సమీపంలోని రజ్వీ చమాన్ వద్ద గన్నీ సంచుల గోడౌన్ లో ప్రమాదవశాత్తు భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈఘటనలో భారీగా మంటలు చెలరేగాయి. గోడౌన్‌లో ఉవ్వెత్తున ఎగిసిపడిన మంటలను స్థానిక సమాచారంతో ఫైర్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మూడు ఫైర్ ఇంజన్లతో పాటు మున్సిపల్ వాటర్ ట్యాంకర్లతో మంటలార్పే ప్రయత్నాలు చేపట్టారు. కొన్ని గంటల తరువాత మంటలు అదుపులోకి వచ్చాయి. ఈఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగక పోవడంతో అక్కడున్న వారు ఊపిరిపీల్చుకున్నారు.
Tragedy In Honeymoon: హనీమూన్‌లో విషాదం.. ఇంటికి తిరిగి వస్తుండగా..