NTV Telugu Site icon

Minister Harish Rao: కేంద్రంలో ఉద్యోగాల మాటేంటి బండి?

Harish

Harish

బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం రోజురోజుకీ పెరుగుతోంది. తాజాగా పటాన్ చెరులో ఆర్థిక మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి కెసిఆర్ 95 శాతం స్థానికులకే అందిస్తూ.. రాష్ట్రపతి ఉత్తర్వులు తెచ్చారన్నారు. అన్ని ఖాళీలు నింపుతున్నాము. 2లక్షల యాభై వేల ఉద్యోగాలు కెసిఆర్ ఇస్తే ఉన్న ఉద్యోగాలు పీకేసింది బిజెపి ప్రభుత్వం అన్నారు హరీష్ రావు. 3 లక్షల ఉద్యోగాలు కేంద్రంలో ఖాళీలు ఉంటే .ఒక్క ఉద్యోగం నింపడం లేదు.

కేంద్రం లోని ఖాళీలు భర్తీ చేస్తే 30 వేల ఉద్యోగాలకు తెలంగాణ విద్యార్థులు ఎంపిక అవుతారు కదా.అగ్నిపథ్ పేరుతో ఆర్మీ లో కాంట్రాక్ట్ ఉద్యోగాలు కల్పిస్తున్నారని మండిపడ్డారు. తుమ్మితే ఊడిపోయే ఉద్యోగాలు అగ్నిపథ్‌ ఉద్యోగాలు. యువత ఆశల మీద నీళ్ళు చల్లుతున్నారు. యువతను నడి సముద్రంలో వదిలేస్తున్నారు. దేశంలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడం లేదు. బీజేపీ ప్రభుత్వం యువతను నిర్వీర్యం చేస్తోందన్నారు హరీష్ రావు. పటాన్ చెరు పట్టణ కేంద్రంలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్ లో పోలీస్ ఉచిత శిక్షణ తరగతుల ముగింపు సభలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచిత నోట్ బుక్స్ పంపిణీ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర ఆర్ధిక ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు బీజేపీ నేతలపై మండిపడ్డారు. ఈకార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శరత్, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.

RRR: నెట్టింట్లో తాండవం చేస్తోన్న తారక్ సీన్

మన హక్కు అయినా కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థలు మంజూరు చేయడం లేదు. రాష్ట్ర యువత ఆలోచించాలి..ఎవరికి మేలు చేశారో బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలి. మతం కులం పేరుతో విద్వేషాలు రెచ్చగొడుతున్నారు.ఉద్యోగాల భర్తీ కోసం బండి సంజయ్ కేంద్రంతో మాట్లాడాలన్నారు. ఏం మొహం పెట్టుకుని పల్లె గోస కార్యక్రమం చేపడుతున్నారని హరీష్ రావు ప్రశ్నించారు.