NTV Telugu Site icon

బీజేపీ పాలనలో ధరలు పెంచి… సబ్సిడీ తగ్గించారు : హరీశ్ రావు

harish rao

సీఎం కేసీఆర్ పాలనలో సంక్షేమ యుగం నడుస్తోంది. చెప్పింది చెప్పినట్లు చేసుడే తప్ప.. మాట తప్పడం మాకు తెల్వదు అని మంత్రి హరీశ్ రావు అన్నారు. రేపురా.. మాపురా అనే ఉద్దెర బేరాలు మా దగ్గర ఉండవు. బీజేపీ పాలనలో పెట్రోలు, డిజీల్, గ్యాస్ ధరలు పెరిగాయి. గ్యాస్ సబ్సిడీ తగ్గించారు. అయినప్పటికీ పువ్వు గుర్తుకే ఓటు వేస్తే.. సిలిండర్ ధర 1500 అవుతుంది అని తెలిపారు. బొట్టుబిల్లలు, గోడగడియారాలు ఇస్తామన్న మాటలు ఆపేసి.. సిలిండర్ ధర, పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గిస్తామని, సబ్సిడీ ఎప్పటిలాగే ఇస్తామని చెప్పండి. బీజేపీ ప్రభుత్వం రైల్వేలు, ఎల్ఐసీ, విమానశ్రాయాలు, నౌకాశ్రయాలు అమ్మి, కుదవపెట్టి.. ఉద్యోగాలన్నీ ఊడగొడతారట. ప్రభుత్వ రంగ సంస్థలు కార్పోరేట్ సంస్థల చేతిలోకి పోతే రిజర్వేషన్లు పోయి.. పిల్లలకు ఉద్యోగాలు ఊడుతాయి. బీజేపీ అనుబంధ కార్మికసంఘమైన బీఎంఎస్ కూడా ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాన్ని వ్యతిరేకిస్తోంది అన్నారు. బీజేపీ కిసాన్ మోర్చా కూడా.. వ్యవసాయ నల్ల చట్టాలను రద్దుచేయాలని డిమాండ్ చేస్తోంది. ఆ పార్టీని సొంత మనుషులే తప్పు పడుతుంటే.. మనం ఎందుకు ఆ పార్టీకి ఓటు వేయాలి అని పేర్కొన్నారు.