NTV Telugu Site icon

Fighting in Marriage : భోజనాల వద్ద వివాదం.. వివాహ వేడుకల్లో ఘర్షణ..

Marriage

Marriage

భోజనాల వద్ద చెలరేగిన వివాదం.. వివాహ వేడుకల్లో వరుడు తరుపు బంధువులపై దాడి జరిగేంత వరకు వచ్చింది. వివరాల్లోకి వెళితే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం బొంబాయి తండా గ్రామంలోని ఓ యువతికి మహబూబాబాద్‌కు చెందిన ఓ యువకుడితో వివాహం జరుగుతోంది. అయితే ఈ నేపథ్యంలో వరుడు తరుపు బంధువులు భోజనాల వద్దకు వచ్చారు. అక్కడ వరుడు తరుపు వారికి, వధువు తరుపు వారికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ వాగ్వాదం కాస్తా.. చిలికిచిలికి గాలివానలా మారినట్లు.. ఘర్షనకు దారి తీసింది. దీంతో వధువు తరుపు బంధువులు.. పెళ్లి కొడుకు తరుపు బంధువులు ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు.

అయితే ఈ దాడిలో పెళ్లి కొడుకు వారికి గాయాలవడంతో.. వారు 100కు డయల్‌ చేసి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాల శాంతిపజేసి.. పెళ్లి కొడుకు తరుపు బంధువులను అక్కడి నుంచి ఆసుపత్రికి తరలించేందుకు ఎస్సై రమాణరెడ్డి ప్రయత్నించారు. దీంతో పెళ్లి కొడుకు తరుపు బంధువులు మా పై దాడి చేశారు.. వారిని వైద్యం కోసం తీసుకు వెళ్ళ వద్దు అంటూ స్థానికంగా ఉన్న ఏడుగురు వ్యక్తులు ఏకంగా ఎస్సై పై దాడికి యత్నించారు.