Fighting in Marriage : భోజనాల వద్ద వివాదం.. వివాహ వేడుకల్లో ఘర్షణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భోజనాల వద్ద చెలరేగిన వివాదం.. వివాహ వేడుకల్లో వరుడు తరుపు బంధువులపై దాడి జరిగేంత వరకు వచ్చింది. వివరాల్లోకి వెళితే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం బొంబాయి తండా గ్రామంలోని ఓ యువతికి మహబూబాబాద్‌కు చెందిన ఓ యువకుడితో వివాహం జరుగుతోంది. అయితే ఈ నేపథ్యంలో వరుడు తరుపు బంధువులు భోజనాల వద్దకు వచ్చారు. అక్కడ వరుడు తరుపు వారికి, వధువు తరుపు వారికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ వాగ్వాదం కాస్తా.. చిలికిచిలికి గాలివానలా మారినట్లు.. ఘర్షనకు దారి తీసింది. దీంతో వధువు తరుపు బంధువులు.. పెళ్లి కొడుకు తరుపు బంధువులు ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు.
అయితే ఈ దాడిలో పెళ్లి కొడుకు వారికి గాయాలవడంతో.. వారు 100కు డయల్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాల శాంతిపజేసి.. పెళ్లి కొడుకు తరుపు బంధువులను అక్కడి నుంచి ఆసుపత్రికి తరలించేందుకు ఎస్సై రమాణరెడ్డి ప్రయత్నించారు. దీంతో పెళ్లి కొడుకు తరుపు బంధువులు మా పై దాడి చేశారు.. వారిని వైద్యం కోసం తీసుకు వెళ్ళ వద్దు అంటూ స్థానికంగా ఉన్న ఏడుగురు వ్యక్తులు ఏకంగా ఎస్సై పై దాడికి యత్నించారు.
Also Read
తాజావార్తలు
-
Amazon Zoox: స్టీరింగ్ లేదు.. డ్రైవర్ లేడు.. అమెజాన్ కొత్త రోబోట్యాక్సీ.. పెయిడ్ రైడ్స్‌కు రంగం సిద్ధం
-
Animal Ambulance: జంతువుల ప్రాణాలు కాపాడేందుకు తొలి EV బైక్ అంబులెన్స్ షురూ.!
-
Divija Prabhakar: ఎంతో కస్టపడి సినిమా చేశాం.. ‘వెంకట్రామయ్య గారి తాలూకా’ అందరికీ నచ్చుతుంది!
-
TG20 League 2026: రాయుడు ‘హిట్’ ఇన్నింగ్స్.. పాలమూరు స్ట్రైకర్స్ ఘన విజయం!
-
Friday Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. వృత్తి, ఉద్యోగ రంగాల్లో మిశ్రమ ఫలితాలు!
ట్రెండింగ్
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!