NTV Telugu Site icon

TRS V/s BJP: ఫ్లెక్సీ వార్.. హైదరాబాద్ నుండి జిల్లాలకు పాకింది

Whatsapp Image 2022 06 30 At 10.54.32 Am

Whatsapp Image 2022 06 30 At 10.54.32 Am

బీజేపీ శ్రేణులు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో సరికొత్త పోరు మొదలైంది. దీంతో.. హైద‌రాబాద్ లో.. ఫ్లెక్సీల వార్ సాగుతుంది. విమర్శలకు ప్రతి విమర్శలు ముదిరి ఫ్లెక్సీలు, కటౌట్ల వార్‌ వరకు వ్య‌వ‌హారం వెళ్లింది. ఈనేప‌థ్యంలో.. ఫ్లెక్సీలు, కటౌట్లతో ‘సాలు దొర.. సెలవు దొర’అంటూ బీజేపీ మోత మోగిస్తుంటే, దానికి ప్రతిగా తాజాగా మంచిర్యాల జిల్లాలోనూ మోడీకి వ్యతిరేకంగా భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కాగా.. చెన్నూరు నియోజకవర్గంలోని ప్రధాన కూడళ్లలో సాలు మోదీ.. సంపకు మోడీ హోర్డింగ్‌లు దర్శణమిస్తున్నాయి. ఇక వరంగల్ నగరం ప్రధాన కూడల్లో మోడీకి వ్యతిరేకంగా వెలింది పోస్టర్ల సమాచారం అందుకున్న బీజేపీ శ్రేణులు ఆ పోస్టర్లను చింపేసే ప్రయత్నం చేశారు. మోడీ ఫోటోలకు పాలాభిషేకం చేశారు.. చాలు సారు దిగిపో సారు అనే పోస్టర్లు వేసేందుకు బీజేపీ సన్నద్ధం అయ్యింది. దింతో నిన్నటి వరకు హైదరాబాద్ కి పరిమితం అయిన టిఆర్ఎస్.. బీజేపీల పోస్టర్ల గొడవ నేడు వరంగల్ కి పాకింది. ఈనేపథ్యంలో.. ఇరు పార్టీలు ప్రధాన కూడళ్లు, ముఖ్య ప్రాంతాల్లో ఫ్లెక్సీలు పెట్టడంతోపాటు సోషల్‌ మీడియాలోనూ పరస్పర విమర్శల యుద్ధం చేస్తున్నాయి.

అయితే.. న‌గంర‌లోని బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద ‘సాలు దొర.. సెలవు దొర’అంటూ డిజిటల్‌ కౌంట్‌ డౌన్‌తో బీజేపీ డిస్ ప్లే ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే.. కేసీఆర్‌ను టార్గెట్‌ చేస్తూ కామెంట్లు పెట్టింది. అయితే బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద పెట్టిన డిజిటల్‌ డిస్ ప్లే బోర్డును అనుమతి లేదంటూ అధికారులు తొలగించారు. అయితే ఈ నేప‌థ్యంలో.. బీజేపీ ప్రచారాన్ని, విమర్శలను తిప్పికొట్టేలా టీఆర్‌ఎస్‌ నేతలు సాలు మోడీ.. సంపకు మోడీ ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు జిల్లాల్లోనూ వెలుస్తున్నాయి. ప్రధాని మోదీ హైదరాబాద్‌ పర్యటన నేపథ్యంలో సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్‌ పరిసరాల్లో ఈ హోర్డింగ్‌లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

కాగా.. ఈ ఫ్లెక్సీలపై.. టీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా కన్వీనర్‌ మన్నె క్రిషాంక్‌ ట్వీట్ వేదిక‌గా విమ‌ర్శ‌లు గుప్తించారు. సాగు చట్టాలు తెచ్చి రైతులను చంపావు’, ‘నాలుగేళ్ల కాంట్రాక్టు ఉద్యోగాలతో యువత కడుపు కొట్టావు’, ‘లాక్‌డౌన్‌ పేరిట గరీబోళ్లను సంపావు’అనే నినాదాలను ముద్రించారు. అంతేకాకుండా.. నోట్ల రద్దు, రైతుచట్టాలు, నల్లధనం వెనక్కి రప్పించడం తదితర అంశాలను ప్రస్తావించారు. ‘ప్రజల ఖాతాల్లో వేస్తానన్న రూ.15 లక్షలు ఎక్కడ?’అని ప్రశ్నలు పెట్టారు. ఈనేపథ్యంలో.. ఫ్లెక్సీలను ప్రస్తావిస్తూ ‘పరేడ్‌ గ్రౌండ్‌కు వస్తున్నవు కదా ఈ పోస్టర్లు ఏపియమంటవా మోదీజీ.. ఎనిమిదేళ్లలో మీ పథకాలు ఎంత మందిని చంపాయో కౌంట్‌ చేద్దామా తరుణ్ చుగ్ ’అని ఎద్దేవా చేశారు.

James Webb Telescope: విశ్వంలోనే లోతైన ఫోటో.. జూలై 12 రిలీజ్